బ్లాస్టింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి
సీతారామపురం: సొరంగ మార్గ పనుల వద్ద బ్లాస్టింగ్ జరిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు ఆర్డీఓ పావని పేర్కొన్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే భారతమాల ఆరు లేన్ల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సీతారామపురం – పోరుమామిళ్ల ఘాట్ రోడ్డు మార్గంలో సొరంగ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. రోజూ ఎన్నిసార్లు బ్లాస్టింగ్ చేస్తున్నారనే అంశాన్ని మ్యాక్స్ ఇన్‌ఫ్రా బృందాన్ని ఆరాతీశారు. పని ప్రదేశంలో ముందుజాగ్రత్తగా అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచాలని కోరారు. నిర్ణీత గడువులోపు టన్నెల్ పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. తహసీల్దార్ ఫాజిహా తదితరులు పాల్గొన్నారు.


