క్యాంపునకు తరలింపు | - | Sakshi
Sakshi News home page

క్యాంపునకు తరలింపు

Dec 12 2025 10:10 AM | Updated on Dec 12 2025 10:10 AM

క్యాం

క్యాంపునకు తరలింపు

టీడీపీని వెంటాడుతున్న అవిశ్వాస భయం

నిన్నటి వరకు గెలుపు ధీమా

తాజా పరిణామాలతో ముచ్చెమటలు

మేయర్‌ స్రవంతికి పెరుగుతున్న మద్దతు

మిగిలిన వారూ ఆత్మప్రబోధానుసారం ఓటేస్తారనే ప్రచారం

అధికార పార్టీ ఉచ్చులోంచి

బయటపడే యోచనలో మరికొందరు

ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ టీడీపీ సాగిస్తున్న దుర్మార్గపు వైఖరికి చెక్‌ పడనుందనే ప్రచారం జోరందుకుంది. నగరపాలక సంస్థలో జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. వాస్తవానికి 2021లో నిర్వహించిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో 54 డివిజన్లకు గానూ అన్నింటినీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. గిరిజనులకు మేయర్‌గా అవకాశమివ్వాలనే ఉద్దేశంతో స్రవంతికి ఆ స్థానాన్ని అప్పగించారు. అయితే గతేడాదిలో కొలువుదీరిన టీడీపీ సర్కార్‌.. ఆ స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే దురుద్దేశంతో కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపింది. అధికార అండతో సంతలో పశువులను కొనుగోలు చేసిన రీతిలో కార్పొరేటర్లకు పచ్చ కండువాలు కప్పి ప్రజాతీర్పును అపహాస్యం చేసింది. అంతటిలో ఆగకుండా మేయర్‌పై అవిశ్వాసాన్ని ప్రకటించి.. ఇక విజయం తమదేననే ధీమాతో ఉన్న వారికి షాకులమీద షాకులు తగులుతున్నాయి. తాజా పరిణామాలతో వారికి ముచ్చెమటలు పడుతున్నాయి.

కార్పొరేటర్లతో జగన్‌మోహన్‌రెడ్డి

సైకిల్‌ పార్టీకి షాక్‌

వైఎస్సార్సీపీలో కార్పొరేటర్ల చేరిక

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు మేయర్‌ పొట్లూరి స్రవంతిపై ఈ నెల 18న పెట్టిన అవిశ్వాస తీర్మాన వేళ టీడీపీకి ఊహించని షాక్‌ తగిలింది. గతంలో పచ్చ కండువా వేసుకున్న ఐదుగురు కార్పొరేటర్లు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి చక్రం తిప్పి వీరిని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో శుక్రవారం చేర్పించారు. నెల్లూరు నగర నియోజకవర్గంలోని ఐదు, ఆరు, 16, 51వ డివిజన్ల కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, మద్దినేని మస్తానమ్మ, వేనాటి శ్రీకాంత్‌రెడ్డి, సాహితి.. రూరల్‌ నియోజకవర్గంలోని 34వ డివిజన్‌ కార్పొరేటర్‌ ఫమీదా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకొన్నారు.

మేము

వైఎస్సార్సీపీ

వెంటే

ఉంటాం..

మీకో దండం..!

వైఎస్సార్సీపీలోకి

ఐదుగురు కార్పొరేటర్లు

టీడీపీ పంచన చేరిన ఐదుగురు కార్పొరేటర్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కండువాను తిరిగి కప్పుకొన్నారు. మరో ఐదుగురు సైతం చేరేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. అవిశ్వాస తీర్మాన రోజు నాటికి మరికొందరు సైతం మద్దతిచ్చే యోచనలో ఉన్నారని సమాచారం.

మా మద్దతు

స్రవంతికే..

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మేయర్‌ పొట్లూరి స్రవంతిపై ఈ నెల 18న జరపనున్న అవిశ్వాస తీర్మాన సమయం దగ్గరపడే కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వాస్తవానికి నాలుగేళ్ల క్రితం నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న స్థానాలు సున్నా. ఈ తరుణంలో గతేడాదిలో నిర్వహించిన ఎన్నికల్లో కొలువుదీరిన టీడీపీ కన్ను ఈ స్థానంపై పడింది. ఇంకేముంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయం సాధించిన కార్పొరేటర్లకు పచ్చ కండువాలను నయానో.. భయానో కప్పారు.

హామీలతో పబ్బం

కొన్ని నెలల క్రితం జరిగిన డిప్యూటీ మేయర్‌ ఎన్నిక సమయంలోనూ ఫిరాయింపు కార్పొరేటర్లకు ఎన్నెన్నో హామీలిచ్చి పబ్బం గడుపుకొన్నారు. తీరా ఇది పూర్తయ్యాక ముఖం చాటేశారు. మేయర్‌పై ఇదే తరహాలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావించిన రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి కార్పొరేటర్ల మద్దతుపై నమ్మకం సన్నగిల్లిందనే టాక్‌ నడుస్తోంది. ఈ తరుణంలో గతంలో ఎన్నడూ అపాయింట్‌మెంట్‌ను సైతం ఇవ్వని అమాత్యుడు తాజాగా, సిటీ పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశమై.. ఒక్కొక్కరికీ రూ.రెండు కోట్ల మేర కాంట్రాక్ట్‌ పనులు, రూ.50 లక్షల చొప్పున తాయిలాలిస్తామంటూ హామీలిచ్చారు.

మేయర్‌కు అంతర్లీనంగా మద్దతు

టీడీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 40 మంది కార్పొరేటర్లను తమ పంచన చేర్చుకున్నారు. అవిశ్వాసానికి సన్నద్ధమైన క్రమంలో అధికార పార్టీ, మేయర్‌ దంపతుల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలతో రాజకీయాలు వేడెక్కాయి. మెజార్టీ బలం ఉందనే ధీమాతో ఉన్న టీడీపీ శిబిరంలో లుకలుకలు మొదలయ్యాయి. మంత్రి, ఎమ్మెల్యేల పోకడల నేపథ్యంలో.. తమ రాజకీయ భవిష్యత్తును కాంక్షిస్తున్న కార్పొరేటర్ల వైఖరిలో మార్పు కనిపించింది. తాజాగా మేయర్‌కు మద్దతు పెరుగుతుండటంతో అధికార పార్టీకి చెమటలు పడుతున్నాయి.

అవిశ్వాస వాయిదాకు యత్నాలు

అధికార బలంతో కుయుక్తులు పన్ని గిరిజన మహిళను గద్దె దింపేందుకు అవిశ్వాస అస్త్రాన్ని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి బయటకు తీశారు. తమ అస్మదీయులను ఆ పీఠమెక్కించేందుకు కుయుక్తులు పన్నారు. 40 మంది కార్పొరేటర్ల మద్దతుండటంతో విజయం తమదేననే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే మేయర్‌ స్రవంతి తటస్తంగా ఉండటంతో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సైతం ఈ విషయాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. తమకెలాంటి సంబంధం లేదనే రీతిలో వ్యవహరిస్తోంది. అయితే టీడీపీకి మద్దతిచ్చే కార్పొరేటర్లకు కాంట్రాక్ట్‌ వర్కులు, తాయిలాలిస్తామని చెప్పినా.. వారి వైఖరిలో మార్పు కనిపిస్తుండటంతో కాపాడుకునేందుకు ఆ పార్టీ పెద్దలు అష్టకష్టాలు పడుతున్నారు.

రంగంలోకి కీలక నేతలు

మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఆనిల్‌కుమార్‌యాదవ్‌, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి వ్యూహాత్మకంగా రంగంలోకి దిగారు. అధికార పక్షానికి చెమటలు పట్టించేలా పచ్చ కండువా కప్పుకొన్న ఐదుగురు కార్పొరేటర్లను తిరిగి సొంతగూటికి వచ్చేలా చేయడంతో టీడీపీ శిబిరం షాక్‌కు గురైంది.

నెల్లూరు నగర నియోజకవర్గంలోని 20 మంది కార్పొరేటర్లలో నలుగురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఉన్న వారిని కాపాడుకునేందుకు టీడీపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఎప్పుడెవరు చేజారుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో పలువుర్ని ప్రత్యేక వాహనాల్లో క్యాంపునకు తరలించారు. టీడీపీ నేత విజయభాస్కర్‌రెడ్డి, పట్టాభిరామిరెడ్డి రంగంలోకి దిగారు. ముఖ్యనేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ క్యాంపు రాజకీయాలకు తెరదీశారు.

క్యాంపునకు తరలింపు 1
1/1

క్యాంపునకు తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement