నవాబుపేట పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఐదో డివిజన్ గిరిజన కార్పొరేటర్ ఓబిలి రవిచంద్ర, ఆరో డివిజన్ కార్పొరేటర్ మస్తానమ్మ తనయుడు మద్దినేని శ్రీధర్‌ను నవాబుపేట పోలీసులు అరెస్ట్ చేశారనే విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఖలీల్ అహ్మద్, కార్పొరేటర్లు వేలూరు మహేష్, కామాక్షిదేవి.. స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులు అరెస్ట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్‌స్టేషన్ లోపలికి అనిల్, చంద్రశేఖర్‌రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులను భారీగా మోహరించారు. ఖాకీలు అదుపులోకి తీసుకున్న ఇద్దరి ఆచూకీ అర్ధరాత్రి వరకు తెలియకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. వారి కుటుంబసభ్యులు సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
పోలీసుల ఫోన్లు స్విచ్ఛాఫ్
తాడేపల్లిలో ఓబిలి రవిచంద్ర, శ్రీధర్‌ను పోలీసులు గురువారం సాయంత్రం ఐదు గంటలకు అదుపులోకి తీసుకొని నెల్లూరు తరలిస్తున్నామని కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే వీరిని ఎక్కడికి తీసుకెళ్లారో అర్ధరాత్రి వరకు తెలియలేదు. పోలీస్ అధికారులకు ఫోన్ చేస్తే అవి స్విచ్ఛాఫ్ అని వస్తున్నాయి. ఏ కేసులు నమోదు చేశారోననే అంశంపైనా స్పష్టతను ఇవ్వలేదు. మరోవైపు పోలీస్‌స్టేషన్లోనే అనిల్‌కుమార్‌యాదవ్, చంద్రశేఖర్‌రెడ్డి దాదాపు రెండు గంటలకుపైగా ఉన్నారు. తమ పార్టీ నేతల వివరాలు తెలిసేంత వరకు వెళ్లేది లేదని పార్టీ శ్రేణులు భీష్మించుకొని కూర్చున్నారు.
పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్న అనిల్‌కుమార్‌యాదవ్
పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్న చంద్రశేఖర్‌రెడ్డి
ఓ కార్పొరేటర్, మరొకరి కుమారుడి అరెస్ట్ నేపథ్యంలో భారీగా చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులు
భారీగా పోలీసుల మోహరింపు
ఎప్పుడేమి జరుగుతుందోననే ఉత్కంఠ
అర్ధరాత్రి వరకు వివరాలు
వెల్లడించని పరిస్థితి
కుటుంబసభ్యుల ఆందోళన
నవాబుపేట పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత
నవాబుపేట పోలీస్‌స్టేషన్ వద్ద ఉద్రిక్తత


