మేత పొరంబోకులో సోలార్ ప్లాంటా..?
● అడ్డుకున్న రైతులు
అనుమసముద్రంపేట: మండలంలోని శ్రీకొలనులో గల సర్వే నంబర్ 411లో దాదాపు 311 ఎకరాల మేత పొరంబోకులో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సంస్థ యజమానులు సిద్ధం చేస్తుండగా, రైతులు గురువారం అడ్డుకున్నారు. పంచాయతీ తీర్మానం లేకుండా భూములను ఎలా ఇస్తారంటూ రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. పశువుల మేత కోసం ఈ భూములు ఏళ్లుగా ఉన్నాయని, ఇప్పుడు హఠాత్తుగా సోలార్ ప్లాంట్‌కు ఇచ్చేందుకు తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. కాగా తమకు కలెక్టర్ నుంచి అనుమతులున్నాయని, ప్లాంట్‌ను ఇక్కడే ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పారు. దీనికి రైతులు అంగీకరించకపోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో పోలీసులకు సంస్థ ప్రతినిధులు సమాచారమివ్వగా, వారొచ్చి రైతులకు నచ్చజెప్పారు.


