వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా చలపతిరావు
కొడవలూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వీరి చలపతిరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులను పార్టీ కార్యాలయం గురువారం విడుదల చేసింది. పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ప్రస్తుతం ఈయన కొనసాగుతున్నారు. డీసీఎమ్మెస్ చైర్మన్‌గా గతంలో రెండుసార్లు పనిచేశారు.
పారదర్శకంగా పరీక్ష నిర్వహణ
నెల్లూరు (టౌన్): జవహర్ నవోదయ విద్యాలయలో ప్రవేశానికి గానూ శనివారం నిర్వహించనున్న పరీక్షను పారదర్శకంగా జరపాలని విద్యాలయ ప్రిన్సిపల్ పార్వతి పేర్కొన్నారు. దర్గామిట్టలోని జెడ్పీ హైస్కూల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, సెంటర్ లెవల్ అబ్జర్వర్లకు గురువారం నిర్వహించిన ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌లో ఆమె మాట్లాడారు. ఆరో తరగతిలో ప్రవేశానికి గానూ జిల్లా వ్యాప్తంగా 3069 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. హాల్‌టికెట్, ఆధార్ జెరాక్స్ కాపీ, బ్లూ / బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ప్యాడ్‌ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఉదయం 10.30కు రిపోర్ట్ చేయాలన్నారు.
తల్లిదండ్రులతో రౌండ్ టేబుల్ సమావేశం నేడు
నెల్లూరు (టౌన్): విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై టౌన్‌హాల్ రీడింగ్ రూమ్‌లో తల్లిదండ్రులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని శుక్రవారం ఉదయం పది గంటలకు నిర్వహించనున్నామని పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.
పారిశ్రామిక పార్క్ భూముల పరిశీలన
దగదర్తి: మండలంలోని ఉలవపాళ్ల జాతీయ రహదారి పక్కన పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు సేకరించాల్సిన భూములను జేసీ వెంకటేశ్వర్లు, కావలి ఆర్డిఓ వంశీకృష్ణ గురువారం పరిశీలించారు. సర్వే నంబర్ 47లో సుమారు 21 ఎకరాల్లో భూములను రైతుల నుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. వీటిని ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారని, ఏమైనా అభ్యంతరాలుంటే తమకు తెలియజేయాలని జేసీ కోరారు. ఆర్‌ఐ ప్రియాంక, మండల సర్వేయర్ రూబియా, వీఆర్వో బాలనాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
అరుణపై పీడీ యాక్ట్
కోవూరు: జిల్లాలో దొంగతనం, దాడులు, బెదిరింపులు, మోసాలు, గంజాయి కేసులతో పలుమార్లు వివాదాల్లో నిలిచిన లేడీ డాన్ నిడిగుంట అరుణపై పీడీ యాక్ట్‌ను అమలు చేశారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న ఆమెను కడప సెంట్రల్ జైలుకు కోవూరు పోలీసులు తరలించారు.
పెన్నా డౌన్ స్ట్రీమ్ పర్యవేక్షణ
సంగం: సంగంలో పెన్నా డౌన్ స్ట్రీమ్ ఎడమవైపు గట్టులో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని తెలుగుగంగ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఈఈ అనిల్‌కుమార్‌రెడ్డి గురువారం పరిశీలించారు. ఇటీవల వచ్చిన తుఫాన్ల ప్రభావంతో డౌన్‌న్‌స్ట్రీమ్ ఎడమ వైపు గట్టు కోతకు గురవుతోంది. దీన్ని పరిశీలించిన అనంతరం గట్టు రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడారు. తాత్కాలిక మరమ్మతు పనులను తక్షణమే చేపడతామని తెలిపారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన వెంటనే శాశ్వత రక్షణ కల్పించేలా పనులను ప్రారంభిస్తామని వెల్లడించారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా చలపతిరావు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా చలపతిరావు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా చలపతిరావు


