రోడ్డెక్కిన అంగన్‌వాడీలు
నెల్లూరు(దర్గామిట్ట): హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్‌వాడీలు రోడ్డెక్కారు. ఈ మేరకు నగరంలోని కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని అంగన్‌వాడీ వర్క ర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవా రం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు రెహనాబేగం మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక వేతనాలు పెంచుతామని, గ్రాట్యుటీ ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ పేర్కొందని, అయితే నేటికీ అతీగతీ లేదని ఆరోపించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనంగా రూ.24,860ను ఇవ్వాలని గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చిందని, దీని మేరకు అందజేయాలని డిమాండ్ చేశారు. వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమ్మె కాలంలో తమకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. నేతలు శేషమ్మ, మల్లెమ్మ, కామాక్షమ్మ, సంపూర్ణమ్మ, రాధ, ప్రమీల, లక్ష్మీ కాంతం, సుగుణమ్మ, మసస్తామ్మ, మారెమ్మ తదితరులు పాల్గొన్నారు.


