పేలిన లారీ టైరు
● ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొని డ్రైవర్ మృతి
గుడ్లూరు: జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ టైరు పేలిపోవడంతో అదుపుతప్పి ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందారు. గుడ్లూరు మండలం మోచర్ల గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. విజయవాడ వైపు నుంచి చైన్నె వెళ్తున్న కంటైనర్ లారీ మోచర్ల సమీపంలోకి రాగానే టైరు పేలింది. దీంతో లారీని అదుపు చేయలేకపోయిన చైన్నెకి చెందిన డ్రైవర్ పెరుమాళ్(47) ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టాడు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందారు. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుడ్లూరు ఎస్సై వి.వెంకట్రావు తెలిపారు.


