రెండు కార్ల బోల్తా
● ఐదుగురు టీచర్లకు తీవ్ర గాయాలు
వలేటివారిపాళెం: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని బోల్తా పడి ఐదుగురు ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వలేటివారిపాళెంలోని హెరిటేజ్ పాల కేంద్రం సమీపంలో మంగళవారం ఉదయం 9 గంటలకు జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కందుకూరులో నివాసం ఉంటున్న ఐదుగురు టీచర్లు వలేటివారిపాళెం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. వారు స్కూల్‌కు కారులో బయలుదేరారు. మండలంలోని నూకవరం గ్రామానికి చెందిన మరో కారు అతివేగంగా వచ్చి టీచర్లు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డు పక్కన ఉన్న మామిడి తోటలో బోల్తా పడ్డాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన టీచర్లను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. పాఠశాల పీడీ ఐజాక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై మదిరినాయుడు తెలిపారు.


