పొలం పనులకు వెళ్లగా..
● పాముకాటుకు వ్యక్తి మృతి
జలదంకి (కలిగిరి): జలదంకి మండలం జమ్మలపాళెం గ్రామం కొత్త ఎస్సీ కాలనీకి చెందిన మైనంపాటి రాజశేఖర్ (42) మంగళవారం పాముకాటుతో మృతిచెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు.. రాజశేఖర్ కూలీ పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రాజశేఖర్‌ను చికిత్స నిమిత్తం కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. రాజశేఖర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. జలదంకి పోలీసులు కేసు నమోదు చేశారు.


