పునర్విభజన ప్రక్రియపై చర్చ
నెల్లూరు సిటీ: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, గూడూ రు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌తో నెల్లూరు మాగుంటలేఅవుట్‌లోని ఆయన నివాసంలో వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం సమావేశమయ్యారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే ప్రక్రియపై చర్చించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు వీరి చలపతిరావు, కొండూరు అనిల్‌బాబు, కలువ బాలశంకర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
రేపట్నుంచి టెట్ పరీక్షలు
నెల్లూరు (టౌన్): ఏపీ టెట్–2025 పరీక్షలు బుధవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు జరగనున్నట్లు డీఈఓ బాలాజీరావు సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పొట్టేపాళెం సమీపంలోని ఆయాన్ డిజిటల్ సెంటర్, జై శ్రీరామ్ ఇన్‌ఫ్రా ఐటీ సొల్యూషన్స్, కావలిలోని విశ్వోదయ, బోగోలులోని ఆర్‌ఎస్‌ఆర్, నెల్లూరులోని నారాయణ, కోవూరులోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలల్లో టెట్ పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు జరుగుతాయని వివరించారు. అభ్యర్థులు గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. హాల్ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని తెలిపారు. టెట్ పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌డెస్క్‌ను 99890 02174, 93910 61007 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి
8 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 75,343 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 26,505 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.69 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.
పునర్విభజన ప్రక్రియపై చర్చ


