ప్రశ్నిస్తున్నందుకే షాపింగ్ కాంప్లెక్స్ మూత
● నియోజకవర్గ
సమన్వయకర్త బుర్రా
కందుకూరు: రాజకీయంగా అధికార పార్టీకి ఎదురొడ్డి ప్ర శ్నిస్తున్నందుకే షేక్ రఫీ పట్ల స్థానిక ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్ మంగళవారం ఒక ప్రకటనలో అన్నారు. దాదాపు రెండేళ్లుగా బీఎస్‌ఎన్‌ఎల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో పదిమంది వ్యాపారులు షాపులు నిర్వహించుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారని చెప్పారు. తాళాలు వేయడంతో వారు రోడ్డున పడ్డారన్నారు. ఈ వ్యవహారమంతా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతోందని, రఫీకి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందన్నారు. న్యాయ పోరాటానికి అన్ని విధాలా పార్టీ సహకారం అందిస్తుందని చెప్పారు. అలాగే నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.


