కక్ష సాధింపు చర్యలు.. డైవర్షన్‌ పాలిటిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపు చర్యలు.. డైవర్షన్‌ పాలిటిక్స్‌

Nov 4 2025 7:44 AM | Updated on Nov 4 2025 7:44 AM

కక్ష

కక్ష సాధింపు చర్యలు.. డైవర్షన్‌ పాలిటిక్స్‌

వెంకటాచలం: చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు, డైవర్షన్‌ పాలిటిక్స్‌తో దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని, ఇలాంటి ఎన్నడూ చూడలేదని ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ అక్రమ అరెస్ట్‌ తర్వాత చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తీసుకొస్తున్నారన్న సమాచారంతో సోమవారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధరెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి భారీగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు తరలివచ్చారు. కాకాణి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరగా విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారు చేసి, ఎందరో ప్రాణాలను బలితీసుకున్నారన్నారు. నకిలీ మద్యంతో రూ.వేల కోట్లు వెనకేస్తున్నారని ఎక్సైజ్‌ అధికారులే నిగ్గు తేల్చారన్నారు. నకిలీ మద్యంలో టీడీపీ నేతలు ఉంటే.. నిస్సిగ్గుగా వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్‌పై కేసు పెట్టడం, అక్రమ అరెస్ట్‌లు చేయించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అసమర్థ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడుపుతున్నారన్నారు. ములకలచెరువులో టీడీపీ నేతలు నకిలీ మద్యంను తయారు చేసి రూ.100లకు అమ్మి సొమ్ము చేసుకుంటూ అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తున్నారన్నారు.

జోగి రమేష్‌పై తప్పుడు కేసు కక్ష సాధింపే

వైఎస్సార్‌సీపీ నేత చెబితే టీడీపీ నేతలు నకిలీ మ ద్యం తయారు చేశారంటూ చెప్పించి జోగి రమేష్‌పై తప్పుడు కేసు పెట్టించడం కక్ష సాధింపే అన్నారు. వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా ఉన్న నేతలను టారె్‌గ్ట్‌ చేసి అక్రమ కేసులు బనాయిస్తుండడం పరిపాటిగా మారిందన్నారు. ఒక అబద్ధపు వాంగ్మూలాన్ని నమోదు చేసి ఈ అక్రమ అరెస్ట్‌కు పాల్పడ్డారన్నారు. ఇలాంటి అక్రమ అరెస్ట్‌లకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు ఎవరూ బెదరన్నారు. కూటమి నేతలు అరాచకాలు చూస్తుంటే.. రాబోయే రోజుల్లో వారు చెల్లించుకునే భారీ మూల్యం ఏ విధంగా ఉంటుందో గుర్తించుకోవాలని హెచ్చరించారు. అక్రమ అరెస్ట్‌లతో పార్టీ కేడర్‌ను భయపెట్టాలని చూస్తే అది వారి భ్రమవుతుందన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి నేతలు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఇలాంటి అక్రమ అరెస్ట్‌లను ప్రోత్సహించిన వారందరిని చట్ట పరంగా శిక్షిస్తామన్నారు. రూ.300 కోట్ల స్కిల్‌ కేసులో అక్రమాలకు పాల్పడిన చంద్రబాబును అరెస్ట్‌ చేస్తే లోకేశ్‌, పవన్‌కళ్యాణ్‌ రోడ్ల మీదకు వచ్చి వేసిన డ్రామాలు మరవలేదన్నారు. ఏ తప్పు చేయని వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నప్పుడు ఈ విషయం వారికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ నేతలవి కుటుంబాలు కావా, ఆ కుటుంబాలు రోడ్డు మీదకు రావా ఒకసారి ఆలోచించు కోవాలన్నారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పాలనను ప్రజలు బిహార్‌ వంటి రాష్ట్రంలో కూడా చూసి ఉండరన్నారు. అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం త్వరలోనే ప్రజాగ్రహానికి గురై కుప్ప కూలుతుందన్నారు. జోగి రమేష్‌ కుటుంబాని పార్టీ తప్పక అండగా ఉంటుందన్నారు. ఇది తప్పుడు కేసని కోర్టులో తేలుతుందని, నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేశారు.

జైలు వద్ద భారీగా

పోలీస్‌ బలగాల మోహరింపు

మాజీమంత్రి జోగి రమేష్‌పై అక్రమ కేసులు పెట్టి కోర్టుకు హాజరుపర్చగా ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్‌ విధించడంలో ఆయన్ను నెల్లూరు సెంట్రల్‌ జైలు వద్దకు తరలించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులు, బీసీ సామాజిక వర్గాల నేతలు రావడంతో భారీగా పోలీసులు మోహరించారు. జైలుకు ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని అక్కడికి రానివ్వకుండా అడ్డుకున్నారు.

చంద్రబాబు బతుకంతా

తప్పుడు విధానాలే

నకిలీ మద్యం తయారీదారులు టీడీపీ

నేతలైతే.. జోగి రమేష్‌కు ఏం సంబంధం

అక్రమ అరెస్ట్‌లకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి

కక్ష సాధింపు చర్యలు.. డైవర్షన్‌ పాలిటిక్స్‌ 1
1/1

కక్ష సాధింపు చర్యలు.. డైవర్షన్‌ పాలిటిక్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement