జిల్లా కేంద్రంలో ఓ ఔషధ అధికారి దందా.. మెడికల్‌ షాపుల యజమానులను వణికిస్తోంది. కార్యాలయానికి డుమ్మా కొట్టి.. ఇంటినే అవినీతికి అడ్డాగా మార్చేశాడు. ప్రైవేట్‌ వ్యక్తులను పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు, రికార్డుల పర | - | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్రంలో ఓ ఔషధ అధికారి దందా.. మెడికల్‌ షాపుల యజమానులను వణికిస్తోంది. కార్యాలయానికి డుమ్మా కొట్టి.. ఇంటినే అవినీతికి అడ్డాగా మార్చేశాడు. ప్రైవేట్‌ వ్యక్తులను పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు, రికార్డుల పర

Nov 4 2025 7:44 AM | Updated on Nov 4 2025 7:44 AM

జిల్ల

జిల్లా కేంద్రంలో ఓ ఔషధ అధికారి దందా.. మెడికల్‌ షాపుల యజ

● జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఔషధ శాఖ అధికారి ఇటీవల నెల్లూరు శివారు ప్రాంతం (25వ డివిజన్‌) ఉన్న ఓ మందుల దుకాణానికి తనిఖీకి వెళ్లాడు. రికార్డులు పరిశీలించారు. యాంటీ బయాటిక్‌ మందులు పది బాక్సులు అప్పుడే ఎలా అమ్మగలిగావు అంటూ ప్రశ్నించాడు. ఆర్‌ఎంపీ వైద్యం చేస్తున్నావటగా దబాయించాడు. దీంతో భయపడిన ఆయన్ను మరో మందుల దుకాణాదారుడి ద్వారా రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేశారు. ఇదొక ఉదంతమే. తన పరిధిలోని దుకాణాల యాజమానుల బెదిరించి భారీగా దందాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నెల్లూరు (అర్బన్‌): జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ అనుమతులు కలిగిన సుమారు 1850 హోల్‌సేల్‌, రీటైల్‌ మెడికల్‌ పాపులున్నాయి. రోజూ రూ.కోట్లలో వ్యాపారాలు జరుగుతాయి. ఈ మందుల దుకాణాలను కావలి, నెల్లూరు డివిజన్లుగా విభజించారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణాధికారి ఉంటారు. కావలి డివిజన్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరిధిలో కావలి, కందుకూరు, ఆత్మకూరు, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలోని మండలాలతోపాటు నెల్లూరు నగరంలోని 1 నుంచి 15 డివిజన్‌లు, 25 నుంచి 50 వరకు డివిజన్లు ఉన్నాయి. 14 నుంచి 24 డివిజన్‌లు, మిగతా మండలాలు మరో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరిధిలో ఉన్నాయి. ఒక ప్రాంతంలోని దుకాణాలన్నింటిని ఒకే ఇన్‌స్పెక్టర్‌ కింద ఉంచాలి. అలా కాకుండా జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు జిల్లా ఔషధ నియంత్రణాధికారి హడావుడిగా డివిజన్ల విభజన చేసి నివేదికను సిద్ధం చేయడంతో ఇలాంటి గందరగోళం నెలకొంది. ఫలితంగా కావలి డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌కు 5 నియోజకవర్గాల్లోని మెడికల్‌ షాపులతోపాటు నెల్లూరు నగరంలోని సగానికి పైగా మందుల దుకాణాలను కేటాయించారు. అసంబద్ధంగా విభజన జరగడంతో నెల్లూరు నగరంలోని 25వ డివిజన్‌ కావలి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరిధి ఉంటే ఆ పక్కనే ఉండే 24వ డివిజన్‌ మరో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పరిధిలో ఉంది. ఇలా గందరగోళంగా విభజన జరిగింది.

ఇంటి వద్దనే తనిఖీలు

ప్రైవేట్‌ మెడికల్‌ షాపు యజమాని చెప్పినట్లు నోటీసులకు వివరణ ఇచ్చేందుకు రికార్డులు తీసుకుని ఆ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇంటి వద్దకు మెడికల్‌ షాపుల యజమానులు రికార్డులు తీసుకెళ్తున్నారు. అక్కడ ఆయన మొక్కుబడిగా రికార్డులు పరిశీలించి రూ.10 వేలు చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వేళ మెడికల్‌ షాపుల వద్దకే ఆ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలకు వెళ్తే మాత్రం రూ.20 వేలు డిమాండ్‌ చేస్తున్నారని సమాచారం. ఇటీవల ఎన్‌టీఆర్‌ నగర్‌లోని మెడికల్‌ షాపులను కావలి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ తనిఖీ చేశారు. వారందరినీ తను ప్రైవేట్‌గా నియమించుకున్న మరో మెడికల్‌ షాపు యజమాని వద్దకు పంపారని తెలుస్తోంది. ఆ ప్రైవేట్‌ వ్యక్తి రూ.10 వేలు చొప్పున వసూలు చేసి సదరు అధికారికి అందజేస్తున్నారని సమాచారం. ఇవే కాక నెలవారీ సాధారణ మామూ ళ్లు ఉంటాయి. అయినా కక్కుర్తి పడి దుకాణాదారులను వేధిస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారననే విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు ఔషధశాఖాధికారి అవినీతి దందాకు మెడికల్‌ షాపుల యజమానులు వణికిపోతున్నారు. ఇప్పటికై నా కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఔషధ నియంత్రణాధికారి పరిస్థితులను అవినీతికి చెక్‌ పెట్టాలని మెడికల్‌ దుకాణాల యజమానులు కోరుతున్నారు.

నోటీసులు పంపించి..

కావలి డివిజన్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించే అధికారి అక్కడి కార్యాలయానికి చుట్టపు చూపుగా వెళ్తున్నాడు. నెల్లూరు ఏడీ కార్యాలయంలోనే తిష్ట వేసి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. కార్యాలయ సిబ్బందిని పక్కన బెట్టి విజయమహల్‌ గేటు సమీపంలో మెడికల్‌ షాపు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్‌ వ్యక్తిని తన అనుచరుడిగా నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రైవేట్‌ వ్యక్తి తన వాట్సాప్‌ ద్వారా ఇతర మెడికల్‌ షాపుల యజమానులకు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పంపించిన నోటీసులు అందజేసి విచారణకు రికార్డులు తీసుకుని రావాలని చెబుతున్నారని సమాచారం.

ప్రైవేట్‌ వ్యక్తులతో నోటీసులు

ఇంటి వద్దకే పిలిపించుకుని

రికార్డుల పరిశీలన

పరిశీలనకు వస్తే రూ.10 వేలు

మెడికల్‌ షాపుల తనిఖీకి వెళ్తే

రూ.20 వేలు డిమాండ్‌

హడలిపోతున్న మెడికల్‌ వ్యాపారులు

జిల్లా కేంద్రంలో ఓ ఔషధ అధికారి దందా.. మెడికల్‌ షాపుల యజ1
1/2

జిల్లా కేంద్రంలో ఓ ఔషధ అధికారి దందా.. మెడికల్‌ షాపుల యజ

జిల్లా కేంద్రంలో ఓ ఔషధ అధికారి దందా.. మెడికల్‌ షాపుల యజ2
2/2

జిల్లా కేంద్రంలో ఓ ఔషధ అధికారి దందా.. మెడికల్‌ షాపుల యజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement