స్మార్ట్ సిటీ.. నెల్లూరు నగర రోడ్లు ప్రత్యక్ష నరకానికి ఆనవాళ్లుగా తయారయ్యాయి. ఇందులో నగరంలోని అపోలో ఆస్పత్రి రోడ్డు ఒక ఉదాహరణ. చిల్డ్రన్స్ పార్క్ రహదారి నుంచి ముత్తుకూరు రోడ్డును కలిపే మరో ప్రధాన మార్గం ఇది. ఈ రోడ్డు చాలాకాలం నుంచి అడుగడుగునా గుంతలమయమై దారుణంగా ఉంది. ఇటీవల వర్షాలకు మరింత అధ్వానంగా మారింది. కనీసం బైక్‌లపై వెళ్లాలన్నా.. సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మీడియాలో, నగర ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు రావడంతో నగరపాలక సంస్థ అధికారులు ఫ్లై యాష్‌ను పోసి చేతులు దులుపుకొన్నారు. కనీసం చదును చేయకపోవడంతో దిబ్బలు దిబ్బలుగా మారింది. ప్రస్తుతం ఎండలు కాస్తుండటంతో
వాహనల రాకపోకల సమయంలో ఎండిపోయిన ఫ్లై యాష్ దుమ్ము రేగుతోంది. అప్పుడూ ఇప్పుడూ సర్కస్ ఫీట్లు తప్పవంటూ నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
నిన్న గుంతలు.. నేడు దిబ్బలు
నిన్న గుంతలు.. నేడు దిబ్బలు
నిన్న గుంతలు.. నేడు దిబ్బలు
నిన్న గుంతలు.. నేడు దిబ్బలు
నిన్న గుంతలు.. నేడు దిబ్బలు
నిన్న గుంతలు.. నేడు దిబ్బలు
నిన్న గుంతలు.. నేడు దిబ్బలు


