మినీ ట్రక్కు ఢీకొని.. | - | Sakshi
Sakshi News home page

మినీ ట్రక్కు ఢీకొని..

Oct 10 2025 6:26 AM | Updated on Oct 10 2025 6:26 AM

మినీ

మినీ ట్రక్కు ఢీకొని..

ఉద్యాన శాఖ విస్తరణాధికారిణి మృతి

నెల్లూరు(క్రైమ్‌): జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉద్యాన విస్తరణాధికారిణి మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నవాబుపేట కృష్ణానగర్‌లో డి.ప్రియాంక (34), బాలవిశ్వనాథ్‌ దంపతులు నివాసముంటున్నారు. ప్రియాంక కోవూరులో ఉద్యాన విస్తరణాధికారిణిగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం ఆమె వేదాయపాళెంలోని ఆ శాఖ జిల్లా కార్యాలయానికి స్కూటీపై బయలుదేరారు. సౌత్‌రాజుపాళెం జంక్షన్‌ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి మినీ ట్రక్కు స్కూటీని వేగంగా ఢీకొంది. గాయాలపాలైన ఆమెను స్థానికులు సమీపంలోని మెడికవర్‌ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రియాంక మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నార్త్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందింది. వారు హాస్పిటల్‌కు చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.

రెండు పెట్రోలు పంపుల సీజ్‌

పొదలకూరు: పట్టణంలోని సంగం రోడ్డు సెంటర్‌లో ఉన్న దామోదరం పెట్రోలు బంక్‌లో గురువారం లీగల్‌ మెట్రాలజీ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి రెండు పంపులను సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా మూడు జిల్లాల లీగల్‌ మెట్రాలజీ అధికారి ఐజాక్‌ మాట్లాడుతూ పెట్రోలు బంక్‌లో కొలతలు తేడా ఉన్నట్టు వెల్లడించారు. 5 లీటర్ల పెట్రోలు, డీజిల్‌ పట్టుకుంటే 100 ఎంఎల్‌ నుంచి 140 ఎంఎల్‌ తేడా చూపుతున్నట్టు పేర్కొన్నారు. తనిఖీల్లో జిల్లా లీగల్‌ మెట్రాలజీ అధికారి రియాజ్‌బాషా, ఏఎస్‌ఓ అంకయ్య, సివిల్‌ సప్లయ్స్‌ డీటీ ఐ.రవి పాల్గొన్నారు.

నెల్లూరు పౌల్ట్రీ

అసోసియేషన్‌ ధరలు

బ్రాయిలర్‌: రూ.118

లేయర్‌ రూ.122

బ్రాయిలర్‌ చికెన్‌: రూ.214

స్కిన్‌లెస్‌ చికెన్‌: రూ.236

లేయర్‌ చికెన్‌: రూ.207

మినీ ట్రక్కు ఢీకొని..1
1/2

మినీ ట్రక్కు ఢీకొని..

మినీ ట్రక్కు ఢీకొని..2
2/2

మినీ ట్రక్కు ఢీకొని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement