
ప్రజల గుండెల్లో వైఎస్సార్ స్థానం పదిలం
ఉదయగిరి సమన్వయకర్త రాజగోపాల్‌రెడ్డి
ఉదయగిరి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ప్రజల గుండెల్లో పదిలమైన స్థానం ఉందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఉదయగిరిలో ట్యాంక్ బండ్ సర్కిల్లో మంగళవారం రాజన్న వర్ధంతిని పార్టీ మండలాధ్యక్షుడు కొండా రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ వైఎస్సార్ సమాజంలో అన్ని వర్గాల అభిమానాన్ని సంపాదించారన్నారు. 108, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం తదితర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి తన పాలన స్వర్ణయుగంగా మార్చారన్నారు. హామీలు నెరవేర్చే గుణం చంద్రబాబుకు లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు ఎంతో మేలు చేశారన్నారు.
అబద్ధపు హామీలతో అఽధికారం చేపట్టిన చంద్రబాబు ప్రతిపక్షంపై కక్ష సాఽధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. తొలుత భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పలువురు నేతలు వైఎస్సార్‌తో ఉన్న అనుబంధం, పాలన గొప్పతనం గురించి వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు గణపం బాలకృష్ణారెడ్డి, పి.మాల్యాద్రిరెడ్డి, మేదరమేట్ల శిలలీల, మోది రామాంజనీయులు, సీనీయర్ నాయకులు చేజర్ల సుబ్బారెడ్డి, షేక్ అలీఅహ్మద్, అక్కి భాస్కర్‌రెడ్డి, కల్లూరు వెంకటేశ్వరరెడ్డి, డేగా వంశీ, పల్లాల కొండారెడ్డి, కె.రమణారెడ్డి, సలీం, దస్తగిరి అహ్మద్, కె.వెంకటరెడ్డి, కె.వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.