
చెలరేగిపోతూ..
నెల్లూరులోని కూటమికి చెందిన ఓ ముఖ్యనేత కన్ను మళ్లీ ఈ గనులపై పడింది.మంగళవారం నుంచి పనులు చేపట్టారు. అనుమతి లేకుండానే బ్లాస్టింగ్‌తో చెలరేగిపోతున్నారు. ఈ గనులపై గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు నడుస్తున్నాయి. ఇటీవల డివిజన్ స్థాయి అధికారి పర్యవేక్షణలో మైనింగ్, పర్యావరణ శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తగా తనిఖీలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అనుమతి లేని గనుల్లో మళ్లీ తవ్వకాలు సాగిస్తున్నా మైనింగ్, వివిధ శాఖల అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నట్లు సమాచారం.