
యాజమాన్య పద్ధతులు పాటించాలి
కలిగిరి: పొగాకు నారుమడులు సాగు చేసే రైతులు బోర్డు అధికారుల సూచనల మేరకు ఆధునిక యాజమాన్య పద్ధతులు పాటించాలని కలిగిరి పొగాకు బోర్డు వేలం నిర్వహణాధికారి శివకుమార్ తెలిపారు. వేలం కేంద్రం పరిధిలోని శెట్టిపాళెం, పార్లపల్లి, కొండాపురం, ఎస్.అగ్రహారం గ్రామాల్లో నారుమడుల సాగును మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారుమడుల సాగుకు బోర్డులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. నారును రిజిస్టర్ చేసుకున్న రైతులకు మాత్రమే విక్రయించాలన్నారు. ఇతరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామన్నారు. బోర్డు రిజిస్ట్రేషన్ లేకుండా నర్సరీలు, నారుమడులు సాగు చేయొద్దన్నారు. కార్యక్రమంలో ఐటీసీ కంపెనీ మేనేజర్ జి.వెంకటేష్, పొగాకు బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.