అనుమతుల్లేని గనుల్లో.. | - | Sakshi
Sakshi News home page

అనుమతుల్లేని గనుల్లో..

Sep 3 2025 4:41 AM | Updated on Sep 3 2025 4:41 AM

అనుమతుల్లేని గనుల్లో..

అనుమతుల్లేని గనుల్లో..

మండలంలోని చాగణం రాజుపాళెం, సైదాపురం సమీపంలో కాలం చెల్లిన శ్రీనివాసా పద్మావతి (శోభారాణి), సిద్ధి వినాయక గనులున్నాయి. గతంలో లీజు తీరిపోవడంతో వాటిని అలాగే వదిలేశారు. ఈ గనిలో మైకా క్వార్ట్‌ ్జ ఖనిజం ఉంది. దీనికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కూటమి నేతలు వాలిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా జీఓలు తెచ్చుకున్నారు. గతేడాది అక్టోబర్‌ నెలలో ఆ గనిలో అక్రమంగా మైనింగ్‌ కార్యకలాపాలు సాగిస్తుండటంతో స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులు ఒప్పుకోలేదు. అధికారుల ద్వారా ముమ్మరంగా తనిఖీలు చేయించారు. దీంతో అందులో విలువైన యంత్రాలను స్వాధీనం చేసుకుని 13 మందిపై కేసులు కూడా నమోదు చేయించారు. ఈ ఏడాది మార్చి నెలలో కూడా తవ్వకాలు సాగించడాన్ని ప్రజాప్రతినిధి అనుచరులే అడ్డుకున్నారు. దీంతో పనులు ఆగిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement