
మైనింగ్.. మళ్లీ మొదలు
కాలం చెల్లిన గనుల్లో ముఖ్యనేత పనులు
● బ్లాస్టింగ్ చేపట్టిన వైనం
● పట్టించుకోని యంత్రాంగం
సాక్షి టాస్క్‌ఫోర్స్: మండలంలోని సైదాపురం, చాగణం రాజుపాళెం సమీపంలో ఎలాంటి అనుమతుల్లేకుండా ఓ ముఖ్యనేత కనుసన్నల్లో అక్రమ మైనింగ్ మళ్లీ మొదలైంది. కొంతకాలం క్రితం స్థానిక ప్రజాప్రతినిధికి ఆ నేతకు మధ్య చెలరేగిన వివాదం కారణంగా మైన్‌పై పోలీసులు, రెవెన్యూ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేసి పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతల మధ్య ఏం జరిగిందో కానీ శ్రీనివాసా పద్మావతి (శోభారాణి), సిద్ధి వినాయక గనుల్లో మళ్లీ అక్రమ మైనింగ్ మొదలైంది. మంగళవారం అనధికారికంగా వాటిల్లో అక్రమంగా బ్లాస్టింగ్ చేసినట్లు తెలిసింది.
కూటమి నేతలే..
నెల్లూరు జిల్లాలోని సైదాపురం, పొదలకూరు, చేజర్ల, ఉదయగిరి మండలంతోపాటు తిరుపతి జిల్లాలోని గూడూరు ప్రాంతాల్లో దొరికే క్వార్ట్ ్జ, ఫల్స్‌పర్, వర్‌ముఖ్‌లైట్ ఖనిజానికి స్వదేశంతోపాటు విదేశాల్లో కూడా ప్రస్తుతం గిరాకీ ఉంది. ప్రధానంగా సైదాపురం మండలంలో దొరికే మైకా క్వార్ట్ ్జకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో కూటమికి చెందిన నేతలు కొత్తగా వ్యాపారాలు చేసేందుకు రంగప్రవేశం చేస్తున్నారు.