● వ్యక్తి మృతి
ఉదయగిరి: మండలంలోని సర్వరాబాదు సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మసాయిపేటకు చెందిన పిడుగు మస్తాన్‌బాబు (30) మోటార్‌బైక్‌పై సీతారామపురం మండలానికి వెళ్లాడు. పని ముగిశాక తిరిగి సొంతూరికి బయలుదేరాడు. ఈ క్రమంలో సర్వరాబాదు సమీపంలో బైక్ గేదెను ఢీకొట్టింది. మస్తాన్‌బాబు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే గేదె కూడా చనిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.