
టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మరోసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. చాహల్ 2025 సీజన్‌లో నార్తాంప్టన్‌షైర్ క్రికెట్ క్లబ్ తరపున ఆడనున్నాడు. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత చాహల్ ఇంగ్లండ్‌కు పయనం కానున్నాడు. ఈ ఏడాది జూన్‌లో చాహల్ నార్తాంప్టన్‌షైర్ క్రికెట్ జట్టులో చేరి సీజన్ ఆఖరి వరకు కొనసాగనున్నాడు.
రెడ్‌బాల్ క్రికెట్‌తో పాటు రాయల్ లండన్ వన్డే కప్‌నకు కూడా చాహల్ అందుబాటులో ఉండనున్నాడు. చాహల్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనుండడం ఇది రెండోసారి. అంతకుముందు 2023లో నార్తాంప్టన్‌షైర్ క్రికెట్ క్లబ్‌కే చాహల్ ప్రాతినిథ్యం వహించాడు. కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో 21.10 సగటుతో 19 వికెట్లు పడగొట్టి.. నార్తాంప్టన్‌షైర్‌ను డివిజన్ టూలో నాల్గవ స్థానానికి చేర్చాడు. ఇక మరోసారి నార్తాంప్టన్‌షైర్ క్రికెట్ క్లబ్ ఒప్పందం కుదుర్చుకోవడంపై చాహల్ స్పందించాడు.
"గత సీజన్‌లో కౌంటీల్లో ఆడిన సమయాన్ని నేను ఆస్వాదించాను. మరోసారి నార్తాంప్టన్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు చాలా సంతోషం ఉంది. నార్తాంప్టన్‌షైర్ డ్రెస్సింగ్ రూమ్‌లో లెజెండరీ క్రికెటర్లు ఉన్నారు. వారితో కలిసి మరోసారి డ్రెసింగ్ రూమ్‌ను పంచుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
గత సీజన్‌లో చివరివరకు మేము అద్భుతమైన క్రికెట్ ఆడాము. ఈ సీజన్‌లో భారీ విజయాలను సాధిస్తామని ఆశిస్తున్నాము" అని చాహల్ పేర్కొన్నాడు. చాహల్ చాలా కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. చాహల్ చివరగా 2023లో భారత్ తరపున ఆడాడు.
అయితే 2024 టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత జట్టులో అతడ సభ్యునిగా ఉన్నాడు. కానీ ఈ టోర్నీ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్-2025 సీజన్ కోసం ఈ లెగ్గీ సన్నద్దమవుతున్నాడు. మెగా వేలంలో అతడిని పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది.
చదవండి: IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్
Comments
Please login to add a commentAdd a comment