
ఐపీఎల్-2025 (IPL 2025) సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది. టీమిండియా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel)కు సారథిగా పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా ఆధికారిక ప్రకటన చేసింది.
తొలుత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని ఢిల్లీ మెనెజ్‌మెంట్ భావించినప్పటికీ.. అతడు అందుకు ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే అక్షర్ పటేల్‌ను తమ జట్టు సారథిగా ఢిల్లీ ఫ్రాంచైజీ నియమించింది.
కాగ ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రూ. 16.50 కోట్ల భారీ ధర వెచ్చించి మరీ అక్షర్‌ను ఢిల్లీ రిటైన్ చేసుకుంది. 31 ఏళ్ల అక్షర్ పటేల్.. 2019 ఐపీఎల్ సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు. గతంలో దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం అక్షర్‌కు ఉంది.
అక్షర్ పటేల్ ప్రస్తుతం భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ డిప్యూటీగా అక్షర్ వ్యవహరించాడు. ఆ సిరీస్‌లో పటేల్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.
ఐపీఎల్‌లో కూడా అతడికి అద్బుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అక్షర్.. 1653 పరుగులతో పాటు 123 వికెట్లు పడగొట్టాడు. ఇక కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం అక్షర్ పటేల్ తొలిసారి స్పందించాడు.
"ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఎంపికవ్వడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ఢిల్లీ యాజమానులకు, సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నాకు బలమైన అనుబంధం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ సభ్యునిగా ఉంటూనే ఒక క్రికెటర్‌గా నేను అత్యున్నతస్ధాయికి చేరుకున్నాను.
ఈ జట్టును ముందుకు నడిపించేందుకు సిద్దంగా ఉన్నాను. మా కోచ్‌లు, స్కౌట్‌లో మెగా వేలంలో సరైన ఆటగాళ్లను కొనుగోలు చేశారు. మా జట్టు ఇప్పుడు అన్ని విభాగాల్లో సమతుల్యంగా ఉంది. మా జట్టులో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు.
ఇది నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఏడాది సీజన్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు"అక్షర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ 13వ కెప్టెన్ కావడం గమనార్హం. గత సీజన్ వరకు తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్‌ను ఢిల్లీ మెగా వేలంలోకి విడిచిపెట్టింది. అతడిని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించింది.
ఢిల్లీ క్యాపిట్సల్ కెప్టెన్లు వీరే...
1 వీరేంద్ర సెహ్వాగ్
2 గౌతమ్ గంభీర్
3 దినేష్ కార్తీక్
4 జేమ్స్ హోప్స్
5 మహేల జయవర్ధనే
6 రాస్ టేలర్
7 డేవిడ్ వార్నర్
8 కెవిన్ పీటర్సన్
9 JP డుమిని
10 జహీర్ ఖాన్
11 కరుణ్ నాయర్
12 శ్రేయాస్ అయ్యర్
13 రిషబ్ పంత్
14 అక్షర్ పటేల్
చదవండి: CT 2025: ఒకే వేదికపై ఆడటం అదనపు ప్రయోజనమే.. విమర్శలతో ఏకీభవిస్తా: స్టార్క్
Comments
Please login to add a commentAdd a comment