అతడు నాకంటే ఎంతో బెట‌ర్‌: యువరాజ్‌ సింగ్‌ | Yuvraj Singhs Stunning Admission Regarding Vaibhav Sooryavanshi | Sakshi
Sakshi News home page

అతడు నాకంటే ఎంతో బెట‌ర్‌: యువరాజ్‌ సింగ్‌

Apr 4 2026 3:52 PM | Updated on Apr 7 2026 8:16 PM

Yuvraj Singhs Stunning Admission Regarding Vaibhav Sooryavanshi

భార‌త యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. అండ‌ర్‌-19 ప్రపంచ‌కప్ ఫైన‌ల్లో భారీ సెంచ‌రీతో స‌త్తాచాటి భార‌త్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపిన వైభ‌వ్‌.. ఇప్పుడు అదే జోరును ఐపీఎల్‌నూ కొన‌సాగిస్తున్నాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

అతిపిన్న వయసులో వేగవంతమైన అర్ధశతకం చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. త‌ద్వారా ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అతిపిన్న వయసులో ఫాస్టెస్ట్  హాఫ్ సెంచ‌రీ చేసిన బ్యాటర్‌గా సూర్య‌వంశీ నిలిచాడు. ఇప్పుడు అదే దూకుడును శ‌నివారం గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగే మ్యాచ్‌లో కొన‌సాగించాల‌ని వైభ‌వ్ భావిస్తున్నాడు.

ఈ నేప‌థ్య‌లో సూర్య‌వంశీపై భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. వైభ‌వ్ ఒక అద్భుత‌మైన బ్యాట‌ర్ అని యువీ కొనియాడాడు.

"ఐపీఎల్‌ ఎంతో మంది యువ ఆట‌గాళ్ల‌ను క్రికెట్ ప్ర‌పంచానికి ప‌రిచయం చేసింది. ఇప్పుడు వైభ‌వ్ సూర్య‌వంశీ కూడా అక్క‌డ నుంచే వ‌చ్చాడు. అసాధ‌ర‌ణ ప్ర‌ద‌ర్శ‌న‌ క‌న‌బ‌రుస్తున్నాడు. అత‌డి బ్యాట్ స్పీడ్ అద్భుతం. నిజం చెప్పాలంటే వైభ‌వ్‌ బ్యాట్ స్పీడ్ నా కంటే మెరుగ్గా ఉంది.

ఇంత వేగంగా బ్యాట్ తిప్పే ప్లేయర్లను నేను చాలా తక్కువ మందిని చూశాను. కేవ‌లం 15 ఏళ్ల వ‌య‌స్సులోనే అద్భుత‌మైన బ్యాటింగ్ స్కిల్స్ క‌లిగి ఉన్నాడు. వైభవ్‌కు మైదానం నలుమూలలా షాట్లు ఆడే స‌త్తా ఉంది. అత‌డు మరిన్ని మ్యాచ్‌లు ఆడేకొద్దీ, మరింత మెరుగైన బ్యాటర్‌గా ఎదుగుతాడు" అని స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో యువీ పేర్కొన్నాడు. కాగా వైభవ్‌కు 15 ఏళ్లు నిండడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు అర్హత సాధించాడు.
చదవండి: PSL 2026: ఐపీఎల్ పొమ్మంది.. కట్ చేస్తే! అక్క‌డ వ‌ర‌ల్డ్ రికార్డు
 

Advertisement
 
Advertisement
Advertisement