టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ భారత మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు బహిరంగ క్షమాపణలు చెప్పడం ఆసక్తి కలిగించింది. తన తండ్రి యోగ్‌రాజ్ సింగ్ గతంలో ధోని, కపిల్ దేవ్‌ల గురించి ఆరోపణలు చేయడమే క్షమాపణకు కారణమని యువీ వెల్లడించాడు.
కాగా యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని తండ్రి యోగ్‌రాజ్ పలు సందర్భాల్లో ధోనిపై ఆరోపణలు చేశారు. యువరాజ్‌కు కెప్టెన్సీ రాకపోవడానికి ప్రధాన కారణం ధోనినేని బహిరంగంగానే విమర్శలు చేయడం అప్పట్లో వివాదానికి దారి తీసింది.
తాజాగా యువరాజ్ ఒక పాడ్‌కాస్ట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో యువరాజ్ మాట్లాడుతూ.. 'నేను కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను' అని అన్నారు. తన తండ్రి ఇంటర్వ్యూలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుందని అడగ్గా.. 'అది సరైంది కాదని మా నాన్నకు చెప్పాను' అని యువరాజ్ పేర్కొన్నాడు. కాగా యోగ్‌రాజ్ సింగ్ గతంలో కపిల్ దేవ్‌పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
1980ల్లో తనను జట్టు నుంచి తొలగించినందుకు కపిల్ దేవ్‌ను చంపాలనుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 'కపిల్ దేవ్ కెప్టెన్ అయినప్పుడు నన్ను అనవసరంగా జట్టులోంచి తీసేశారు. అప్పట్లో నా పిస్టల్ తీసుకుని కపిల్ ఇంటికి వెళ్లాను. అతని తల్లి అక్కడ ఉండటంతో వదిలేశాను. ఆ రోజే నేను క్రికెట్ ఆడకూడదని, నా కొడుకు యువీతో ఆడిస్తానని నిర్ణయించుకున్నాను' అని యోగ్ రాజ్ గతంలో గుర్తు చేసుకున్నారు.
బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ వంటి వారు ఆటగాళ్లను సరిగ్గా గౌరవించలేదని, మన కెప్టెన్ల వల్లే జట్టు నాశనమైందని ఆయన బహిరంగంగా విమర్శలు చేసేవారు. అయితే తన తండ్రి చేస్తున్న ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యల పట్ల యువరాజ్ సింగ్ ఇప్పుడు క్షమాపణలు కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
15 ఏళ్ల పాటు భారత క్రికెట్‌లో ప్రముఖ పాత్ర వహించిన యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడిగా ఉన్నాడు. అయితే ధోని కెప్టెన్సీలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన యువరాజ్‌కు నాయకత్వ బాధ్యతలు తీసుకునే అవకాశం రాలేదు. 2000లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన యువరాజ్ సింగ్ టీమిండియా తరఫున 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
చదవండి: ‘సిగ్గుపడుతున్నా.. అతడిపై నిషేధం విధించండి’
Do tune in tomorrow as the Yuvraj Singh Podcast drops at 12 noon Friday on @sports_tak @YUVSTRONG12 pic.twitter.com/jGOZhiJBkz
— Vikrant Gupta (@vikrantgupta73) April 2, 2026


