
భారత మాజీ క్రికెటర్, ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తన వ్యాఖ్యలతో ఇటీవల తరుచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా యోగరాజ్ మరోసారి తన కామెంట్స్‌తో హాట్‌టాపిక్‌గా నిలిచాడు. ఐపీఎల్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్‌ను ఉద్దేశించి యోగరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
తనకు ఒక్క సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కోచ్‌గా అవకాశం ఇస్తే.. ఆ జట్టుకు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందిస్తాని ఆయన చాలా నమ్మకంగా చెప్పుకొచ్చారు. ఒకవేళ కోచ్‌గా విఫలమైతే అభిమానుల నుంచి వచ్చే ఏ డిమాండ్‌ను అయినా స్వీకరించేందుకు తను సిద్దమని ఆయన అన్నారు. తన కోచింగ్ సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని యోగరాజ్ పేర్కొన్నారు.
కాగా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆడుతున్నప్పటికి ఒక్కసారి కూడా టైటిల్‌ను ముద్దాడలేకపోయింది. ప్రతీ సీజన్‌లోనూ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగడం.. లీగ్ స్టేజిలోనో, ప్లే ఆఫ్స్‌లోనో ఇంటిముఖం పట్టడం పంజాబ్‌కు పరిపాటుగా మారింది. అయితే తాజా ఐపీఎల్ ఎడిషన్‌ను మాత్రం పంజాబ్ విజయంతో ప్రారంభించింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌పై 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. కొత్త సారథి శ్రేయస్ అయ్యర్ అయినా కింగ్స్ ఫ్రాంచైజీకి తొలి టైటిల్‌ను అందిస్తాడో లేదో చూడాలి.
ఇక యోగరాజ్ విషయానికి వస్తే.. సొంతంగా ఆయన క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్నారు. భారత్ తరపున గొప్ప క్రికెటర్లలో ఒకడిగా ఎదిగిన తన కుమారుడు యువరాజ్ సింగ్‌తో సహా అనేక మంది యువ ఆటగాళ్లకు మోంటార్‌గా యోగరాజ్ పనిచేశారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఆయన దగ్గర శిక్షణ పొందాడు. 1980లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యోగరాజ్.. భారత్ తరఫున ఒక టెస్టు, 6 వన్డేలు ఆడాడు.
చదవండి: ఆర్సీబీ స్పిన్నర్లు భేష్.. కేకేఆర్ బౌలర్లు ఏం చేశారు?: రహానేకు పిచ్ క్యూరేటర్ కౌంటర్