
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా మెకాలి గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలిగింది. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది.
ఆమె స్ధానాన్ని ఉమా చెత్రితో భారత క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. కాగా ఈ మెగా టోర్నీ కోసం హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు వైజాగ్‌లో ప్రాక్టీస్ క్యాప్‌ను నిర్వహించింది. ఈ సన్నాహకాల్లో భాగంగానే భాటియా గాయపడింది. ఈ క్రమంలోనే వరల్డ్‌కప్‌తో పాటు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు కూడా యస్తికా దూరమైంది.
"వైజాగ్‌లో జరిగిన టీమిండియా సన్నాహక శిబిరంలో యాస్తికా భాటియా ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో ప్రపంచకప్‌కు యస్తికా దూరమైంది. ప్రస్తుతం ఆమె బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే యాస్తికా గత కొన్ని సిరీస్‌ల నుంచి జట్టుతో ఉన్నప్పటికి ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం రెగ్యూలర్‌గా చోటు దక్కించుకోవడం లేదు. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్‌కు ప్రత్యామ్నాయంగా కొనసాగుతోంది. ఇప్పుడు రిచాకు బ్యాకప్‌గా అస్సాంకు చెందిన ఉమా జట్టుతో చేరనుంది. ఉమా చెత్రి ఇప్పటివరకు భారత తరపున వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. కాగా ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గౌహతి వేదికగా భారత్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.
ఆస్ట్రేలియాతో వన్డేలకు భారత జట్టు(అప్‌డేటడ్): హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే, రాధా యాదవ్, శ్రీ చరణి, స్నేహ రాణా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్)
మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025కు భారత జట్టు (అప్‌డేటడ్): హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, స్నేహ రాణా, ఉమా చెత్రీ