BAN vs IND: 'ప్రపంచకప్‌కు ఇంకా చాలా సమయం ఉంది.. ఇప్పడు మా దృష్టి అంతా దాని పైనే'

World Cup is still 89 months from now, we cannot think so far ahead: Rohit - Sakshi

వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ గురించి ఇప్పుడు నుంచి ఆలోచించడం తొందరపాటే అవుతుందని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి వన్డే సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన రోహిత్‌ ఈ వాఖ్యలు చేశాడు. ప్రస్తుతం మా దృష్టి అంతా బంగ్లా సిరీస్‌పైనే ఉంది అని రోహిత్‌ తెలిపాడు.

"మేము ఆడే ప్రతి సిరీస్‌ వన్డే ప్రపంచకప్‌ సన్నాహాకాల్లో భాగంగానే జరగుతుంది. కానీ ప్రపంచకప్‌కు ఇంకా 8-9 నెలల సమయం ఉంది. ఇప్పటికైతే అంత దూరం ఆలోచించడం లేదు. ప్రస్తుతం ఒక జట్టుగా సమిష్టింగా ఎలా రాణించాలన్న విషయంపై దృష్టి సారిస్తాం. మేమ ఇంకా చాలా విషయాల్లో మెరుగుపడాలి.

ఇలాంటి కాంబినేషన్‌, అలాంటి కాంబినేషన్‌ అని ఇప్పుడే నిర్ణయించుకోం. మేము ప్రస్తుతం ఏమి చేయాలనుకుంటున్నాము అనే దాని గురించి నేను, కోచ్‌ ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నాము. ప్రపంచ కప్‌కు సమయం దగ్గరపడినప్పుడు అందుకు తగ్గట్టు ప్రాణాళికలు రచించేందుకు సిద్దంగా ఉన్నాము. వరల్డ్‌కప్‌ వరకు మేము అన్ని మ్యాచ్‌ల్లో అత్యుత్తమంగా రాణించాలి అనుకుంటున్నాము. బంగ్లాతో వన్డే సిరీస్‌ గెలవడమే మా ప్రస్తుత లక్ష్యం" అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.
చదవండి: IND vs BAN 1st ODI: తొలుత బ్యాటింగ్‌ చేయనున్న భారత్‌.. యువ బౌలర్‌ ఎంట్రీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top