IPL 2026: అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌! | IPL 2026 RCB Vs SRH Weather Update And Pitch Report, No Rain Interuption For Today Match, Check Out Squad Details Inside | Sakshi
Sakshi News home page

RCB Vs SRH Weather Update: అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌!

Mar 28 2026 9:20 AM | Updated on Mar 28 2026 11:18 AM

Weather Report-No Rain Interuption For RCB Vs SRH Match IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌కు మ‌రికొన్ని గంట‌ల్లో తెర‌లేవ‌నుంది.  బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా డిఫెండింగ్ చాంపియ‌న్ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ), స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడ‌య్యాయి. 

మండు వేస‌విలో ఫోర్లు, సిక్స‌ర్ల వ‌ర్షంలో రెండు నెల‌ల పాటు అభిమానులు త‌డిసి ముద్ద‌య్యేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే మారుతున్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల దృష్ట్యా ఈసారి వ‌రుణుడు కూడా ఐపీఎల్ మ్యాచ్‌ల‌పై ప్ర‌భావం చూపించే అవ‌కాశం లేక‌పోలేదు. ఈ నేప‌థ్యంలో సీజ‌న్ తొలి మ్యాచ్‌కు వ‌ర్షం అడ్డంకి ఏమైనా ఉందా అన్న విష‌యం ఆస‌క్తిగా మారింది. 

అయితే మ్యాచ్‌కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే అవ‌కాశం లేద‌ని బెంగ‌ళూరు కేంద్రంగా ఉన్న వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. వాతావ‌ర‌ణ శాఖ మేర‌కు బెంగ‌ళూరుకు చిన్న చినుకుకు కూడా అవ‌కాశం లేద‌ని తెలిపింది. ఆకాశం నిర్మ‌లంగా ఉంటుంద‌ని, గాలిలో తేమ ఎక్కువ ఉన్నందును టాస్ గెలిచిన జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్‌కు మొగ్గు చూపే అవ‌కాశ‌ముంద‌ని తెలిపింది. 

రాత్రి ఉష్ణోగ్ర‌త 20 డిగ్రీల సెల్సియ‌స్ మేర ఉంటుంద‌ని పేర్కొంది. ఇది అభిమానుల‌కు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. భార‌త్‌లో చిన్న స్టేడియాల్లో ఒక‌టైన చిన్న‌స్వామి స్టేడియంలో  బౌండ‌రీ మీట‌ర్ త‌క్కువ దూరం ఉండ‌డంతో ప‌రుగుల వ‌ర‌ద పార‌డం ఖాయంగా కనిపిస్తోంది. 2025లో చాంపియ‌న్‌గా నిలిచిన ఆర్సీబీ త‌మ 17 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించింది. 

ర‌జ‌త్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ బ్యాటింగ్‌లో బ‌లంగా క‌నిపిస్తోంది. కోహ్లీ, సాల్ట్‌, జితేశ్ శ‌ర్మ‌, ప‌డిక్క‌ల్‌, టిమ్ డేవిడ్‌, పాటిదార్‌, బ్యాటింగ్‌లో కీల‌కం కానున్నారు. మ‌రోవైపు బౌలింగ్‌లో కాస్త బ‌ల‌హీనంగా ఉన్న‌ప్ప‌టికీ భువ‌నేశ్వ‌ర్‌, ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ పైనే భారం పడనుంది. 

ఇక ఐపీఎల్లోనే అత్యంత బ‌ల‌మైన బ్యాటింగ్ లైన‌ప్‌ ఎస్ఆర్‌హెచ్ సొంతం. పాట్‌ కమిన్స్ గైర్హాజ‌రీలో ఇషాన్ కిష‌న్ నాయ‌క‌త్వంలో ఎస్ఆర్‌హెచ్ బ‌రిలోకి దిగుతోంది. హెడ్‌, అభిషేక్ శ‌ర్మ‌, క్లాసెన్‌, లివింగ్‌స్టోన్‌, నితీవ్ కుమార్‌ల‌తో బ్యాటింగ్ ప‌టిష్టంగా ఉంది. అయితే క‌మిన్స్ లేక‌పోవ‌డంతో బౌలింగ్‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, జ‌య‌దేవ్ ఉనాద్క‌ట్ కీల‌కం కానున్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటిదార్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లి , దేవదత్ పడిక్కల్‌, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా , స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్, భువనేశ్వర్ కుమార్ , రసీ షర్మా దయాల్, భువనేశ్వర్ కుమార్ వెంకటేష్ అయ్యర్, జాకబ్ డఫీ, సాత్విక్ దేస్వాల్, మంగేష్ యాదవ్, జోర్డాన్ కాక్స్, విక్కీ ఓస్త్వాల్, విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్

సన్‌రైజర్స్ హైదరాబాద్: ఇషాన్‌ కిషన్‌ (కెప్టెన్‌), ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్. స్మరన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ , నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్ , శివన్ కుమార్ అన్ద్కత్, ఎషన్ కుమార్ అన్ద్కత్, ఎషాన్ మలింగస్ సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలే, అమిత్ కుమార్, ప్రఫుల్ హింగే, క్రైన్స్ ఫులేట్రా, లియామ్ లివింగ్‌స్టోన్, శివమ్ మావి, జాక్ ఎడ్వర్డ్స్, పాట్‌ కమిన్స్‌

చదవండి: ఉచితంగా ఐపీఎల్‌ టికెట్లు 

Advertisement
 
Advertisement
Advertisement