
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను అభిమానులు టీమిండియాలో జెర్సీలో చూసి దాదాపు 6 నెలలపైనే అవుతోంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందు అనుహ్యంగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ దిగ్గజ క్రికెటర్లు.. కేవలం వన్డేల్లో మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనలో విరాట్, రోహిత్‌లను చూడొచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ రాజకీయ, దౌత్యపరమైన పరిణామాలతో బంగ్లా పర్యటనను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో అభిమానులకు నిరాశే మిగిలింది. తిరిగి వీరిద్దని ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో చూసే అవకాశముంది.
కానీ ఈ సీనియర్ ద్వయం వన్డే ప్రపంచకప్-2027లో ఆడడం అనుమానమే. వీరిద్దరి వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై ఓ బీసీసీఐ సీనియర్ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు.
"కోహ్లి, రోహిత్ శర్మ వన్డే ఫ్యూచర్‌పై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటాము. వన్డే ప్రపంచకప్-2027కు మాకు ఇంకా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఉంది. అప్పటికి కోహ్లి, రోహ్లి ఇద్దరి వయస్సు 40 సంవత్సరాలు దాటుతోంది. కాబట్టి ఈ మెగా ఈవెంట్ కోసం మేము స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.
కొంతమంది యువ ఆటగాళ్లకు కూడా జట్టులో అవకాశమివ్వాలి. కోహ్లి, రోహిత్ ఇద్దరూ వైట్‌బాల్ క్రికెట్‌లో భారత జట్టు ఎంతో కాలం నుంచి తమ సేవలను అందిస్తున్నారు. ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యారు. వారు ప్రతీదీ సాధించారు.
కాబట్టి అటువంటి లెజెండరీ క్రికెటర్లను రిటైర్మెంట్ ప్రకటించాలని ఎవరూ ఒత్తిడి తీసుకురారు. కానీ తదుపరి వన్డే సైకిల్ ప్రారంభమయ్యే సమయానికి వారు వారు మానసికంగా, శారీరకంగా సిద్దంగా ఉన్నారో లేదో పరీక్షించక తప్పదు అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.
చదవండి: టీమిండియా గెలుస్తుందని నాకు ముందే తెలుసు: సౌరవ్ గంగూలీ