
Photo Courtesy: IPL 2019
Vinoo Mankad Son Rahul Writes Email To Sourav Ganguly Stop Using Mankading.. క్రికెట్‌లో మన్కడింగ్ అనే పదం వినగానే.. మొదటగా గుర్తుకువచ్చేది టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. మన్కడింగ్ అంటే.. బౌలర్ బంతి వేయకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ క్రీజు దాటి బయటకు వెళితే.. బౌలర్‌కు రనౌట్ చేసే అవకాశం ఉంటుంది. దీనిని అశ్విన్ 2019 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జాస్ బట్లర్‌పై ఉపయోగించడం అప్పట్లో వివాదానికి దారి తీసింది. ఈ విషయంలో కొందరు అశ్విన్‌ను తప్పు బడితే.. మరికొందరు అతన్ని సమర్థించారు.
చదవండి: Rahul Dravid: కోచ్ అనే పదానికి అర్థం మారుస్తున్న ద్రవిడ్.. వీడియో వైరల్
అయితే అంతకముందే టీమిండియా నుంచి వినూ మన్కడ్ రెండుసార్లు ఒకే ఆటగాడిని మన్కడింగ్ చేశారు. 1947-48లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. సిడ్నీ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ బిల్ బ్రౌన్ పదేపదే క్రీజు దాటుతుండడంతో వినూ మాన్కడ్ అతన్ని హెచ్చరించాడు. మరోసారి బిల్ బ్రౌన్ బంతి వేయకుండానే క్రీజు దాటడంతో మాన్కడ్ బ్రౌన్‌ను మన్కడింగ్ చేశాడు. ఆ తర్వాత రెండో టెస్టులోనూ బ్రౌన్ ఇదే తరహాలో చేయడంతో వినూ మాన్కడ్ ఈసారి అతనికి వార్నింగ్ ఇవ్వకుండానే మన్కడింగ్(రనౌట్ చేశాడు). ఈ చర్య అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. కాగా ఈ వివాదం తర్వాతే వినూకు.. వినూ మన్కడ్ అని పేరు రావడం విశేషం.
చదవండి: ఎందుకు ఆగిపోయావు అశ్విన్..?
అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటికి మన్కడింగ్ అనే పదాన్ని వాడుతుండడంపై వినూ మన్కడ్ కుమారుడు రాహుల్ మన్కడ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాజగా రాహుల్ మన్కడ్ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మన్కడింగ్ అంశంపై ఈమెయిల్ ద్వారా లేఖ రాశారు. ఐసీసీ మన్కడింగ్ పదాన్ని తొలగించిందని.. దానిని రనౌట్ అనే పిలుస్తుందని.. ఇప్పటికైనా బీసీసీఐ మన్కడింగ్ అని పిలవడం మానేయాలంటూ లేఖ ద్వారా గంగూలీని కోరాడు.
''నా తండ్రి వినూ మన్కడ్ దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన తొలితరం క్రికెటర్లలో ఒకరు. ఆటగాడిగా ఎంతో గౌరవం సంపాదించిన ఆయనపై మన్కడింగ్ అనే పదం ఉపయోగించడం నాకు బాధ కలిగించింది. ఐసీసీ ఆ పదాన్ని తొలగించింది. క్రికెట్ లా బుక్స్ ప్రకారం మన్కడింగ్‌ను రనౌట్ అనే పేరుతో పిలుస్తున్నారు. మన్కడింగ్ అనే పదం వినగానే నా తండ్రి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇది నాకు నచ్చలేదు. అందుకే బీసీసీఐని విజ్ఞప్తి చేస్తున్నా. మన్కడింగ్ అని పిలవడం ఆపేయండి.. ఐసీసీ ప్రకారం దానిని రనౌట్‌గా పరిగణించడం ఉత్తమం'' అంటూ పేర్కొన్నారు.
చదవండి: అరంగేట్ర మ్యాచ్‌లోనే నలుగురిని మన్కడింగ్ చేసిన బౌలర్
ఇక వినూ మాన్కడ్ టీమిండియా తరపున 44 టెస్టులు ఆడి 2109 పరుగులు చేశాడు. మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన మాన్కడ్ బౌలింగ్‌లోనూ 132 వికెట్లు తీశాడు. 1996లో క్రికెట్‌లో అతని సేవలకు గాను భారత ప్రభుత్వం అతని పేరుమీద పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది. ఇక ఈ ఏడాది మొదట్లో వినూ మన్కడ్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించారు.