ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 27) జరుగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదారాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌కు ముందు అందరి చూపు రాజస్థాన్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. ఎందుకంటే ఈ బుడ్డోడు ఈ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్నాడు.
ఇప్పటివరకు ఆడిన 14 మ్యాచ్‌ల్లో 232.27 స్ట్రయిక్‌రేట్‌తో 583 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 3 అర్ద సెంచరీలు సహా 53 సిక్సర్లు, 50 బౌండరీలు ఉన్నాయి. వైభవ్ ఇవాళ ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగే మ్యాచ్‌లోనూ తప్పక చెలరేగుతాడని భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నాకౌట్ మ్యాచ్‌ల్లో వైభవ్ ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం. ఈ బిహారి చిన్నోడు అన్ని విభాగాల్లో ఇప్పటివరకు 8 నాకౌట్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 209.62 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 392 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూస్తే నాకౌట్ మ్యాచ్‌ల్లో వైభవ్ దూకుడు ఏమాత్రం తగ్గదని స్పష్టమవుతుంది.
కాబట్టి నేటి మ్యాచ్‌లో అతడు చెలరేగడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. పవర్ ప్లేలోనే అతడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా అంచనా వేయడానికి బలమైన కారణాలు లేకపోలేదు.
ఈ సీజన్ పవర్ ప్లేలో వైభవ్ 231కు పైగా స్ట్రయిక్ రేట్‌తో ఏకంగా 430 పరుగులు చేశాడు. ఈ గణాంకాలే ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. మ్యాచ్ ప్రారంభం కాగానే వైభవ్ పని పట్టకపోతే పెను ముప్పు తప్పదని వారు ఓ అంచనాకు వచ్చేశారు.
ఈ నేపథ్యంలో వారు వైభవ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఈ సీజన్‌లోనే జరిగిన లీగ్ మ్యాచ్‌లో వైభవ్ ఎస్‌ఆర్‌హెచ్‌పై 37 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ ఇబ్బందిపడిన అంశాలను ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు టార్గెట్ చేసే అవకాశం ఉంది.
గత మ్యాచ్‌లో అతడు ఎడమ భుజం వైపు గుడ్ లెంగ్త్ బంతులను ఎదుర్కొనేందుకు ఇబ్బందిపడ్డాడు. కమిన్స్, సాకిబ్ హుసేన్ ఈ ఏరియాలోనే వైభవ్‌ను టార్గెట్ చేసేందుకు వ్యూహరచన చేసుకొని ఉంటాయి.
నాకౌట్ మ్యాచ్‌ల్లో వైభవ్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్‌లు..
2024 అండర్-19 ఆసియా కప్ సెమీఫైనల్లో శ్రీలంకపై 36 బంతుల్లో 67 పరుగులు
2026 అండర్-19 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 33 బంతుల్లో 68 పరుగులు
2026 అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు


