వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌! | Vaibhav Suryavanshi Likely lead india under-19 team in Sri Lanka tour | Sakshi
Sakshi News home page

BCCI: వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!

Apr 20 2026 3:06 PM | Updated on Apr 20 2026 4:06 PM

Vaibhav Suryavanshi Likely lead india under-19 team in Sri Lanka tour

ఐపీఎల్ 2026 సీజన్ అనంతరం భారత అండర్‌-19, అండర్‌-23 జట్లు శ్రీలంక టూర్‌కు వెళ్లనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా  భార‌త యువ జ‌ట్లు శ్రీలంక అండర్‌-19, లయన్స్ టీమ్స్‌తో  నాలుగు రోజుల రెడ్ బాల్ మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను  బీసీసీఐ త్వ‌ర‌లోనేఖరారు చేయ‌నుంది.

అయితే శ్రీలంక పర్యటనకు వెళ్లే జట్లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ జూన్‌లో ఒక ప్రత్యేక టోర్నమెంట్‌ను  నిర్వహించనుంది.  ఇప్ప‌టికే  దేశవ్యాప్తంగా 64 మంది యువ ఆటగాళ్లు బోర్డు షార్ట్ లిస్ట్ చేసింది.  వీరింతా ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని బీసీసీఐ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్ష‌ణ పొందుతున్నారు.

ఈ యువ ఆట‌గాళ్లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రాటుదేలుతున్నారు. ఈ టోర్నీలో అత్యుత్తుమ ప్ర‌ద‌ర్శ‌న ఆట‌గాళ్లు శ్రీలంక వెళ్లే విమానం ఎక్క‌నున్నారు. ఐపీఎల్‌-2026లో ఆడుతున్న యంగ్ కిడ్స్ వైభ‌వ్ సూర్య‌వంశీ, అయూశ్ మాత్రే కూడా సీజ‌న్ ముగిసిన త‌ర్వాత ఈ క్యాంప్‌లో చేరనున్నారు.

కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ?
అయితే శ్రీలంక టూర్‌కు ముందు భారత అండర్‌-19 కెప్టెన్ అయూష్ మాత్రే గాయపడడం సెలక్టర్లు తలనొప్పిగా మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న మాత్రే  తొడ కండరాలు (హ్యామ్‌స్ట్రింగ్‌) పట్టేశాయి. దీంతో అతడు వికెట్ల మధ్య పరిగెత్తేందుకు ఇబ్బంది పడ్డాడు. 

అతడు గాయం తీవ్రమైనదిగా తెలుస్తోంది. ఒకవేళ మాత్రే గాయం గ్రేడ్‌-3లో ఉన్న‌ట్ల‌యితే పూర్తిగా కోలుకోవ‌డానికి రెండు నెలల సమయం పడుతోంది. అదే జ‌రిగితే రోహిత్ ఐపీఎల్‌-2026 సీజ‌న్ మ‌ధ్య‌లోనే వైదొలగడంతో పాటు శ్రీలంక పర్యటనకు కూడా మాత్రే దూరమయ్యే అవకాశముంది. మరోవైపు అండర్‌-19 వైస్ కెప్టెన్ వియాన్ మల్హోత్రా కూడా స్వ‌ల్ప గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. 

వియాన్ మల్హోత్రాను ఐపీఎల్‌-2026 వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసింది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అత‌డు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఒక‌వేళ శ్రీలంక టూర్‌కు మాత్రే, వియాన్ ఇద్ద‌రు అందుబాటులో లేక‌పోతే భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీ అవ‌కాశ‌ముంది. సూర్య‌వంశీ గ‌తంలో సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అత‌డి నేతృత్వంలోని యంగ్ ఇండియా ఆ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. మళ్లీ ఇప్పుడు వైభవ్ తన కెప్టెన్సీని నిరూపించుకునే సమయం వచ్చిందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: PSL: పిరికిపందలు.. ఎక్స్‌ట్రాలు వద్దు.. పాక్‌ బోర్డుకు ఘాటు కౌంటర్‌

Advertisement
 
Advertisement
Advertisement