ఎస్‌ఆర్‌హెచ్‌తో ఇవాళ (మే 27) జరుగుతున్న ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 97 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సెంచరీ మిస్ అయినా ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ చాలా రికార్డులు బద్దలు కొట్టాడు.
16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ (నాకౌట్స్)లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సురేశ్ రైనాతో కలిసి షేర్ చేసుకున్నాడు.
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ (నాకౌట్స్)లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీస్
16 - సురేశ్ రైనా vs PBKS, వాంఖడే, 2014
16 - వైభవ్ సూర్యవంశీ vs SRH, ముల్లాన్‌పూర్, 2026*
17 - ఆడం గిల్ క్రిస్ట్ vs DC, సెంచూరియన్, 2009
20 - ఎంఎస్ ధోని vs MI, బెంగళూరు, 2012
21 - డ్వేన్ స్మిత్ vs CSK, ఢిల్లీ, 2013
21 - వీరేంద్ర సెహ్వాగ్ vs CSK, వాంఖడే, 2014
21 - రజత్ పాటిదార్ vs GT, ధర్మశాల, 2026
ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు
61* - వైభవ్ సూర్యవంశీ (2026)
59 - క్రిస్ గేల్ (2012)
52 - ఆండ్రీ రస్సెల్ (2019)
51 - క్రిస్ గేల్ (2013)
45 - జోస్ బట్లర్ (2022)
ఐపీఎల్ సీజన్‌లో ఒక అన్‌క్యాప్డ్ బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు
680 - వైభవ్ సూర్యవంశీ (RR, 2026)*
625 - యశస్వి జైస్వాల్ (RR, 2023)
616 - షాన్ మార్ష్ (PBKS, 2008)
573 - రియాన్ పరాగ్ (RR, 2024)
549 - ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (PBKS, 2025)
ఐపీఎల్‌లో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక 50లు
6 - అభిషేక్ శర్మ
5 - నికోలస్ పూరన్
5 - వైభవ్ సూర్యవంశీ*
ఐపీఎల్ పవర్ ప్లే (1-6 ఓవర్లు)లో అత్యధిక 50+ స్కోర్లు
6 - డేవిడ్ వార్నర్
5 - వైభవ్ సూర్యవంశీ
4 - ట్రావిస్ హెడ్
ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్‌లో (1-6) మధ్య ఓవర్లలో 50+ స్కోర్లు
87 - సురేష్ రైనా vs PBKS, 2014
74 - ఆడమ్ గిల్ క్రిస్ట్ vs DD, 2009
60 - వైభవ్ సూర్యవంశీ vs SRH, 2026*
ఐపీఎల్‌లో 1-6 ఓవర్లలో అత్యధిక సిక్సర్లు
8 - వైభవ్ సూర్యవంశీ (RR) vs SRH, జైపూర్, 2026 ELM*
7 - సనత్ జయసూర్య (MI) vs CSK, ముంబై WS, 2008
7 - జోస్ బట్లర్ (RR) vs DC, ఢిల్లీ, 2018 (వర్షం కుదించిన గేమ్)
7 - జానీ బెయిర్‌స్టో (PBKS) vs RCB, బ్రబౌర్న్, 2022
7 - అభిషేక్ శర్మ (SRH) vs PBKS, ముల్లన్‌పూర్, 2026
7 - వైభవ్ సూర్యవంశీ (RR) vs SRH, జైపూర్, 2026
ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పవర్‌ప్లే (1-6 ఓవర్లు) పరుగులు
490 - వైభవ్ సూర్యవంశీ (2026)*
467 - డేవిడ్ వార్నర్ (2016)
402 - ట్రావిస్ హెడ్ (2024)
402 - సాయి సుదర్శన్ (2025)
382 - ఆడమ్ గిల్‌క్రిస్ట్ (2009)
ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు 10+ సిక్సర్లు
4 - క్రిస్ గేల్
4 - వైభవ్ సూర్యవంశీ*
2 - అభిషేక్ శర్మ
2 - ఫిన్ అలెన్
ఐపీఎల్ నాకౌట్స్/ప్లే ఆఫ్స్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు
11* - V సూర్యవంశీ vs SRH, జైపూర్, 2026*
10 - S గిల్ vs MI, అహ్మదాబాద్, 2023
9 - R పాటిదార్ vs GT, ధర్మశాల, 2026
ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (భారతీయుడు)
12 - వి సూర్యవంశీ (RR) vs SRH, 2026
12 - V సూర్యవంశీ (RR) vs SRH, 2026 ELM
11 - మురళీ విజయ్ (CSK) vs RR, 2010
11 - వి సూర్యవంశీ (RR) vs GT, 2025
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ 13.5 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వైభవ్‌తో పాటు ధృవ్ జురెల్ (21 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగాడు. యశస్వి జైస్వాల్ 29 పరుగులు చేసి ఔట్ కాగా.. రియాన్ పరాగ్ (12), ఫెరియెరా క్రీజ్‌లో ఉన్నారు.


