మరోసారి కనీళ్లు పెట్టుకున్న వైభవ్‌ సూర్యవంశీ | Vaibhav Sooryavanshi Crying In Corner, Helplessly Consoled By KKR Players | Sakshi
Sakshi News home page

కనీళ్లు పెట్టుకున్న వైభవ్‌ సూర్యవంశీ.. ఓదార్చిన కే​కేఆర్‌ సభ్యుడు

Apr 20 2026 1:01 PM | Updated on Apr 20 2026 2:13 PM

Vaibhav Sooryavanshi Crying In Corner, Helplessly Consoled By KKR Players

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 19) మధ్యాహ్నం జరిగిన కేకేఆర్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ భావోద్వేగాలకు వేదికైంది. సీజన్‌లో 6 మ్యాచ్‌ల తర్వాత తొలి విజయాన్ని అందుకోవడంతో కేకేఆర్‌ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. కొందరు ఆనందంలో ఏడ్చేసినంత పని చేశారు. 

మరోవైపు రాజస్థాన్‌ బుడ్డోడు వైభవ్‌ సూర్యవంశీ ఓటమిని జీర్ణంచుకోలేక మైదానంలో ఓ మూలన కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్యాప్‌తో ముఖాన్ని దాచుకుంటూ బాధను వ్యక్తం చేశాడు. ఈ సమయంలోకేకేఆర్‌ సిబ్బందిలో ఒకరు అతని వద్దకు వచ్చి ఓదార్చారు. అతని పక్కన కూర్చుని కాసేపు మాట్లాడి, ఆలింగనం చేసుకొని ధైర్యం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

వైభవ్ ఇలా బాధపడటం కొత్తేమీ కాదు. ఔటైనప్పుడు, జట్టు ఓడినప్పుడు తాను ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ని అన్న విషయాన్ని మరిచిపోయి ఏడ్చేస్తాడు. ఇది ఓ రకంగా అభిమానులను ఆకట్టుకుంటుంది. 52, 78, 39 లాంటి  స్కోర్లు చేసినా, వైభవ్‌ తన తప్పులను విశ్లేషించుకుంటూ బాధపడ్డ పడ్డాడు. మొత్తంగా వైభవ్‌ క్రికెటర్‌గా ఎంత పరిణితి చెందినా, అతనిలోని పిల్లాడు భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతున్నాడు.

తాజాగా కేకేఆర్‌ చేతిలో రాజస్థాన్‌ ఓడిన మ్యాచ్‌లో వైభవ్‌ 28 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే మధ్య ఓవర్లలో వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌, కార్తీక్‌ త్యాగి అద్భుతంగా బౌలింగ్‌తో రాజస్థాన్ బ్యాటింగ్‌ను కుదిపేశారు. ఫలితంగా రాజస్థాన్ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 

అనంతరం​ ఛేదనలో కేకేఆర్‌ సైతం తడబడినా.. రింకూ సింగ్‌ (53 నాటౌట్‌), అనుకూల్‌ చౌదరి (29 నాటౌట్‌) అసాధారణ ప్రదర్శనతో తమ జట్టుకు సీజన్‌ తొలి విజయాన్ని అందించారు.

సూపర్‌ ఫామ్‌లో వైభవ్‌
ప్రస్తుత సీజన్‌లో వైభవ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 246 పరుగులు చేసి జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 236.54 కాగా, సగటు 41.00గా ఉంది. ఒకే ఒక్క మ్యాచ్‌లో మాత్రమే అతను డకౌటయ్యాడు. మిగతా మ్యాచ్‌ల్లో స్థిరంగా రాణించాడు. ఆరెంజ్ క్యాప్ పోటీలోనూ వైభవ్ టాప్-5లో ఉన్నాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ (283 పరుగులు) వద్ద ఆరెంజ్‌ క్యాప్‌ ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement