'అతడొక సంచలనం.. టీమిండియా సూపర్‌ స్టార్‌ అవుతాడు' | Vaibhav Sooryavanshi To Become A Proper Superstar: grame smith | Sakshi
Sakshi News home page

IPL 2026: 'అతడొక సంచలనం.. టీమిండియా సూపర్‌ స్టార్‌ అవుతాడు'

Apr 9 2026 10:34 PM | Updated on Apr 9 2026 10:44 PM

Vaibhav Sooryavanshi To Become A Proper Superstar: grame smith

ఐపీఎల్‌-2026 సీజన్‌లో రాజస్తాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్బుత బ్యాటింగ్‌తో దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ వైభవ్ సత్తాచాటాడు .ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా పేరొందిన జస్ప్రీత్ బుమ్రాను సైతం వైభవ్ విడిచిపెట్టలేదు. 

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా వేసిన తొలి బంతికే వైభవ్ సిక్సర్‌గా మలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 14 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌పై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం గ్రేమ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్‌ను "అసలైన సూపర్ స్టార్"గా స్మిత్‌ అభివర్ణించాడు.

నేను ఊహించినట్లే ఫ్లాట్ పిచ్‌లు, అధిక స్కోరింగ్ మ్యాచ్‌లతో ఐపీఎల్ ప్రారంభమైంది. ఎప్ప‌టిలాగే రోహిత్ శ‌ర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియ‌ర్ సూప‌ర్ స్టార్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ ఆట‌గాడు వైభ‌వ్ సూర్య‌వంశీ మాత్రం అంద‌రికంటే ఎక్కువగా న‌న్ను ఆక‌ట్టుకున్నాడు. 

మొదటి బంతి నంచే త‌న ప‌వర్‌ను అత‌డు చూపిస్తున్నాడు. అత‌డి బ్యాటింగ్ టెక్నిక్ నిజంగా అద్భుతం. ఈ టోర్నమెంట్ ముగిసేలోపు వైభ‌వ్‌ ఒక సూపర్ స్టార్ అవుతాడు. భార‌త క్రికెట్‌కు కూడా అత‌డు భ‌విష్య‌త్తు బ్యాటింగ్‌ స్టార్ అవుతాడ‌ని స్మిత్ పేర్కొన్నాడు.
చదవండి: భారత లెజెండరీ క్రికెటర్‌ కన్నుమూత
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement