IND vs NZ: ఒక్క వికెట్‌.. అప్పుడు గెలుపు.. ఇప్పుడేమో ఇలా

Two Test Matches Same Scenarios IND Vs NZ Drawn But WI Won Vs Pak - Sakshi

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియాకు ఒక్క వికెట్ విజయాన్ని దూరం చేసింది. కివీస్‌ టెయిలెండర్లు రచిన్‌ రవీంద్ర, ఎజాజ్‌ పటేల్‌లు 52 బంతుల పాటు ఓపికగా ఆడి ఓటమి నుంచి గట్టెక్కించారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో టీమిండియాకు నిరాశ తప్పలేదు. అయితే ఇదే ఏడాది పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో దాదాపు ఇదే తరహాలో జరిగింది. అయితే ఇక్కడి సందర్భాలు వేరుగా ఉన్నాయి. అప్పటి మ్యాచ్‌లో విండీస్‌ ఒక్క వికెట్‌ తేడాతో పాకిస్తాన్‌పై చారిత్రక విజయాన్ని సాధించగా.. తాజాగా భారత్‌ మాత్రం కివీస్‌తో మ్యాచ్‌లో ఒక వికెట్‌ తేడాతో విజయానికి దూరమైంది. రెండు సందర్భాలు వేరుగా ఉన్నా.. ఇక్కడ ఒక్క వికెట్‌ అనేది కామన్‌గా కనిపిస్తోంది.

చదవండి: Test Cricket: ఇది ఆటంటే.. టెస్టు మజా ఏంటో చూపించింది


పాకిస్తాన్‌- విండీస్‌ టెస్టు మ్యాచ్‌ ఫోటో

విషయంలోకి వెళితే.. ఆగస్టులో పాకిస్తాన్‌ విండీస్‌ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో పాకిస్తాన్‌పై వెస్టిండీస్‌ 1 వికెట్‌ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇక విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటై 36 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌట్‌ కావడంతో విండీస్‌ ముందు 167 పరుగుల లక్ష్యం ఉంచింది. అయితే విండీస్‌ పాకిస్తాన్‌ బౌలర్ల దెబ్బకు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఆట ముగియడానికి 1.1 ఓ‍వర్‌ మిగిలి ఉండగా.. సింగిల్‌ తీయడంతో విండీస్‌ 1 వికెట్‌ తేడాతో విజయం సాధించింది. ఇక టీమిండియా, న్యూజిలాండ్‌ మధ్య ఒక వికెట్‌ తేడాతో మ్యాచ్ డ్రాగా ముగియడంతో ప్రస్తుతం అభిమానులు రెండు మ్యాచ్‌ల ఫోటోలను షేర్‌ చేయడం వైరల్‌గా మారింది. 

చదవండి: Rahul Dravid: ద్రవిడ్‌ రూటే సెపరేటు! గ్రౌండ్స్‌మెన్‌కు రూ.35 వేలు.. కారణం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top