T20 World Cup 2021:England Vs West Indies Match Preview - Sakshi
Sakshi News home page

T20 WC Eng Vs WI: మళ్లీ విధ్వంసం చూస్తామా!

Oct 23 2021 10:31 AM | Updated on Oct 23 2021 2:48 PM

T20 World Cup 2021: Super 12 England Vs West Indies Match Preview - Sakshi

వెస్టిండీస్‌.. మళ్లీ తమ భీకర బ్యాటింగ్‌నే నమ్ముకుంది.

T20 World Cup 2021 Eng Vs WI: 2012, 2016 టీ20 వరల్డ్‌కప్‌లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచింది వెస్టిండీస్‌. టీ20 ప్రపంచకప్‌-2021లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న విండీస్‌... మళ్లీ తమ భీకర బ్యాటింగ్‌నే నమ్ముకుంది. సూపర్‌-12లో భాగంగా శనివారం ఇంగ్లండ్‌తో తమ తొలి మ్యాచ్‌లో తలపడుతోంది. ఇక ఫాబియన్‌ అలెన్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో.. అతడి స్థానంలో అకీల్ హొసేన్‌ను చివరి నిమిషంలో జట్టులోకి తీసుకున్నారు. 

జట్టు బలాబలాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా గేల్‌ ఎప్పుడైనా చెలరేగిపోగలడు. లూయిస్, పొలార్డ్, పూరన్, హెట్‌మైర్, రసెల్‌ బాదడం మొదలు పెడితే వారిని ఆపతరం కాదు. అయితే రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లలోనూ పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌ చేతుల్లో ఓడటం కొంత ఆందోళనపరిచే అంశం.

వెస్టిండీస్‌: సూపర్‌ 12, గ్రూప్‌ 1
కీరన్‌ పొలార్డ్‌, నికోలస్‌ పూరన్‌, డ్వేన్‌బ్రావో, రాస్టన్‌ చేజ్‌, ఆండ్రీ ఫ్లెచర్‌, క్రిస్‌ గేల్‌, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, ఇవిన్‌ లూయిస్‌, ఒబెడ్‌ మెకాయ్‌, లెండిల్‌ సిమన్స్‌, రవి రాంపాల్‌, ఆండ్రీ రసెల్‌​, ఒషేన్‌ థామస్‌, హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌, అకీల్‌ హుసేన్‌.
రిజర్వు ప్లేయర్లు: డారెన్‌ బ్రావో, షెల్డన్‌ కాట్రెల్‌, జేసన్‌ హోల్డర్‌.

ఇంగ్లండ్‌ పరిస్థితి ఏంటి?
మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టులో కూడా పెద్ద సంఖ్యలో ఆల్‌రౌండర్లు ఉన్నారు. తొమ్మిదో స్థానం ఆటగాడి వరకు కూడా భారీ షాట్లు ఆడగల సమర్థులు. ఇటీవల ఘోరంగా విఫలమవుతున్న కెపె్టన్‌ మోర్గాన్‌ దారిలో పడితే ఇంగ్లండ్‌కు సమస్యలన్నీ తీరినట్లే. అయితే స్పిన్నర్లు ఈ జట్టు బ్యాట్స్‌మెన్‌ ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి.   

ఇంగ్లండ్‌- సూపర్‌ 12, గ్రూప్‌-1
ఇయాన్‌ మోర్గాన్‌, మొయిన్‌ అలీ, జొనాథన్‌ బెయిర్‌స్టో, సామ్‌ బిల్లింగ్స్‌, జోస్‌ బట్లర్‌, టామ్‌ కరన్‌, క్రిస్‌జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలన్‌, ఆదిల్‌ రషీద్‌, జేసన్‌రాయ్‌, డేవిడ్‌ విల్లే, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌వుడ్‌.
రిజర్వు ప్లేయర్లు: లియామ్‌ డాసన్‌, జేమ్స్‌ విన్స్‌, రీస్‌ టోప్లే.

చదవండి: T20 World Cup 2021: కోహ్లి సేన బలబలాలు ఏంటి.. ఏ ఆటగాడి రికార్డు ఎలా ఉంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement