Smriti Mandhana: అద్భుత ప్రదర్శన.. ప్రతిష్టాత్మక అవార్డు రేసులో స్మృతి మంధాన

Smriti Mandhana Among Nominees For ICC T20 Cricketer Of The Year - Sakshi

వరుసగా రెండో ఏడాది... 

ICC T20 Cricketer Of The Year Award: మహిళల విభాగంలో గతేడాది ‘టి20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు నామినేట్‌ అయిన భారత ఓపెనర్‌ స్మృతి మంధాన ఈ ఏడాదీ రేసులో నిలిచింది. తాజా 2022 తుది జాబితాలో నిదా దార్‌ (పాకిస్తాన్‌), సోఫీ డివైన్‌ (న్యూజిలాండ్‌), తాహ్లియా మెక్‌గ్రాత్‌ (ఆస్ట్రేలియా)లతో స్మృతి పోటీ పడుతుంది. ఈ ఏడాది స్మృతి 23 బంతుల్లో ఫిఫ్టీ సాధించడంతో వేగవంతమైన అర్ధసెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా ఘనత వహించింది.

ఈ సీజన్‌లోనూ తన జోరును కొనసాగించిన ఆమె ఈ ఫార్మాట్‌  కెరీర్‌లో 2500 పరుగుల్ని పూర్తి చేసుకుంది. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్, టి20 ఆసియా కప్‌ ఈవెంట్‌లలోనూ మెరుపులు మెరిపించింది. ఇటీవల ఆస్ట్రేలియా అమ్మాయిలతో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ విజయాన్ని అందించింది.

ముందుగా 188 పరుగుల లక్ష్యఛేదనలో మంధాన (49 బంతుల్లో 79) మెరుపు ఆరంభం వల్లే ఆసీస్‌ 187 స్కోరును భారత్‌ సమం చేయగలిగింది. సూపర్‌ ఓవర్లోనూ కీలకమైన 13 (4, 6, 3) పరుగుల వల్లే భారత్‌ 20/1 స్కోరు చేసింది. తర్వాత ఆసీస్‌ 16/1 స్కోరుకే పరిమితమైంది. ఇక పురుషుల టీ20 క్రికెట్‌ విభాగంలో డాషింగ్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచాడు.

చదవండి: Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్‌.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్‌ అంటే కేవలం..
Rishabh Pant: క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు ఘోర ప్రమాదం.. తీవ్ర గాయాలు
ICC Award: టి20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రేసులో సూర్య

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top