
భారత క్రికెట్‌లో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు శిఖర్ ధావన్ (Shikhar Dhawan). టీమిండియా ఓపెనర్‌గా రాణించిన గబ్బర్.. టెస్టుల్లో అరంగేట్రంలోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత తొలి ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్ సందర్భంగా భారత్ మూడో మ్యాచ్‌లో ధావన్.. 85 బంతుల్లోనే శతక్కొట్టాడు.
ఇక ఐసీసీ వన్డే టోర్నమెంట్లలోనూ 50కి పైగా సగటుతో 90కి పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన బ్యాటర్‌గానూ గుర్తింపు పొందాడు. వన్డే వరల్డ్‌కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలలో రాణించి ధావన్.. ఈ ఘనత అందుకున్నాడు. అంతేకాదు.. తన వందో వన్డేలోనూ సెంచరీ చేసిన గబ్బర్.. ఈ ఘనత సాధించిన భారత తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.
అదే విధంగా.. ఐపీఎల్ (IPL)లోనూ వరుసగా రెండు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్‌గానూ ధావన్ తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకున్నాడు. 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై శతకం (101 నాటౌట్) బాదిన గబ్బర్.. మరో మూడురోజుల్లోనే పంజాబ్ కింగ్స్‌పై 106 పరుగులు సాధించాడు.
టఫెస్ట్ బౌలర్ అతడే
ఇలా బ్యాటర్‌గా తనకంటూ ప్రత్యేక రికార్డులు సాధించిన ధావన్.. తన కెరీర్‌లో ఎంతో మంది మేటి బౌలర్లను ఎదుర్కొన్నాడు. అయితే, వారందరిలో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్న విషయాన్ని గబ్బర్ తాజాగా వెల్లడించాడు. సౌతాఫ్రికా పేస్ లెజెండ్ టఫ్ బౌలర్ అని.. అతడి వైవిధ్యభరితమైన పేస్, దూకుడు, నైపుణ్యం తన భయపెట్టేదని తెలిపాడు.

ఆండర్సన్ బౌలింగ్ అంటే కూడా భయం
అదే విధంగా.. ఇంగ్లండ్ పేస్ దిగ్గజం జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్‌లో ఆడేందుకు కూడా ఇబ్బందిపడేవాడినని ధావన్ చెప్పుకొచ్చాడు. IANSకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ‘ది వన్’ పేరిట ధావన్ తన ఆటోబయోగ్రఫీ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను గబ్బర్ రాశాడు.
ఇదిలా ఉంటే.. 2010 నుంచి 2022 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన శిఖర్ ధావన్.. 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 2315, 6793, 1759 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లోనూ గబ్బర్‌కు ఘనమైన చరిత్ర ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో 222 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 6768 పరుగులు చేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌కు కూడా అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు.