షారుక్ ఖాన్, సాయి కిషోర్‌ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా టీమిండియాకు! | Shahrukh Khan, R Sai Kishore added as backups for West Indies series Says Reports | Sakshi
Sakshi News home page

IND vs WI: షారుక్ ఖాన్, సాయి కిషోర్‌ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా టీమిండియాకు!

Jan 30 2022 12:30 PM | Updated on Jan 30 2022 2:01 PM

 Shahrukh Khan, R Sai Kishore added as backups for West Indies series Says Reports - Sakshi

స్వ‌దేశ‌లో టీమిండియా వెస్టిండీస్‌తో మూడు వ‌న్డేలు, మూడు టీ20ల్లో త‌ల‌ప‌డ‌నుంది. ఆహ్మ‌దాబాద్ వేదిక‌గా ఫిబ్రవ‌రి 6న తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే వ‌న్డే ,టీ20 సిరీస్‌ల‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే వెస్టిండీస్‌తో జరగనున్న వైట్-బాల్ సిరీస్ కోసం త‌మిళ‌నాడు స్టార్ ఆట‌గాళ్లు షారుక్ ఖాన్ , సాయి కిషోర్‌ల‌ను టీమిండియా బ్యాక‌ప్‌గా బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా గ‌త ఏడాది జ‌రిగిన స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజ‌య్ హాజారే ట‌ర్న‌మెంట్‌లో వీరిద్ద‌రూ అద్భుతంగా రాణించారు.

భార‌త్- విండీస్ సిరీస్ స‌మ‌యంలో ఏ ఆటగాడైనా క‌రోనా బారినా ప‌డితే వీరిద్ద‌రూ జ‌ట్టులోకి రానున్నారు. కాగా రెండేళ్లలో అనేక సిరీస్‌ల మ‌ధ్య‌లో చాలా మంది ఆటగాళ్లు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే  వీరిద్దరినీ రిజర్వ్ ప్లేయర్లుగా బీసీసీఐ ఎంపిక చేసినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
వన్డే జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్, శిఖర్‌ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్, దీపక్‌ చహర్, శార్దుల్‌ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, వాషింగ్టన్‌ సుందర్, సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్‌ ఖాన్, దీపక్‌ హుడా

చ‌ద‌వండి: బంతిని చూడకుండానే భారీ సిక్సర్... అంత కాన్ఫిడెన్స్ ఏంటి ర‌షీద్‌ భయ్యా!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement