చెలరేగిన శాంసన్.. చెపాక్‌లో సూపర్‌ సెంచరీ | Sanju Samsons back, Shuts critics with first century of IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: చెలరేగిన శాంసన్.. చెపాక్‌లో సూపర్‌ సెంచరీ

Apr 11 2026 9:45 PM | Updated on Apr 11 2026 9:46 PM

Sanju Samsons back, Shuts critics with first century of IPL 2026

ఐపీఎల్‌-2026లో తొలి సెంచరీ నమోదైంది. చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. తొలి మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైన సంజూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలర్లను తన ట్రేడ్ మార్క్ షాట్లతో సంజూ ఉతికారేశాడు.

కేవలం 52 బంతుల్లోనే నాలుగో ఐపీఎల్‌ సెంచరీ మార్కును సంజూ అందుకున్నాడు. సీఎస్‌కే జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ త్వరగా కోల్పోయినప్పటికి.. సంజూ మాత్రం యువ ఆటగాడు ఆయూశ్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వారిద్దరూ రెండో వికెట్‌కు 100కు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత మాత్రే రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగినప్పటికి, సంజూ మాత్రం తన జోరును కొనసాగించాడు.

మొత్తంగా 56 బంతుల్లో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అక్షర్‌ పటేల్‌ ఒక్కడే ఓ వికెట్‌ సాధించాడు.

అయూశ్‌ మాత్రే రిటైర్డ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్‌-2026 వేలానికి ముందు సంజూ శాంసన్‌ను రూ. 18 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ నుంచి సీఎస్‌కే ట్రేడ్‌చేసుకుంది. అయితే తొలి మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లకే (6, 7, 9 పరుగులు) అవుట్ అయ్యి విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇప్పుడు తన సూపర్ సెంచరీతోనే విమర్శలకు సమాధనమిచ్చాడు.
చదవండి: ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement