Sanju Samson: ఫిఫా వరల్డ్‌కప్‌లో వైరలవుతోన్న సంజూ శాంసన్‌ బ్యానర్లు

Sanju Samson Fans Show-up Banners His-Support At-FIFA WC 2022 Qatar - Sakshi

టీమిండియా టాలెంటెడ్‌ ఆటగాడు సంజూ శాంసన్‌కు అన్యాయం జరుగుతూనే ఉంది. న్యూజిలాండ్‌తో ముగిసిన టి20 సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికి ఒక్క మ్యాచ్‌ కూడా ఆడించలేదు. ఆ తర్వాత వన్డే సిరీస్‌లోనూ అదే పరిస్థితి. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఏదో మొక్కుబడిగా తొలి వన్డే ఆడించారు. ఆ తర్వాత వెంటనే రెండో వన్డేకు పక్కకు తప్పించారు. అలా అని సంజూ శాంసన్‌ బాగా ఆడలేదా అంటే 37 పరుగులు చేశాడు.

ఎన్ని అవకాశాలిచ్చినా వరుసగా విఫలమవుతున్న పంత్‌ కంటే శాంసన్‌ చాలా బెటర్‌గా కనిపిస్తున్నాడు. దీపక్‌ హుడాకు స్థానం కల్పించడానికి శాంసన్‌ను తప్పించినట్లు ధావన్‌ చెబుతున్నప్పటికి సౌత్‌ ప్లేయర్‌ అనే వివక్ష కొట్టొచ్చినట్లు కనిపించిదని అభిమానులు పేర్కొన్నారు. మరి నవంబర్‌ 30(బుధవారం) జరిగే చివరి వన్డేలోనైనా సంజూకు అవకాశం ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సంగతి పక్కనబెడితే.. సంజూ శాంసన్ ఫ్యాన్స్  ఖతర్ వేదికగా జరుగుతున్న   ఫిఫా ప్రపంచకప్‌లో అతని బ్యానర్లు ప్రదర్శించడం వైరల్‌గా మారింది.ఫిఫా మ్యాచ్ లకు హాజరవుతూ  శాంసన్ కు మద్దతుగా బ్యానర్లు  ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా గల్ఫ్ దేశాలలో  మళయాళీలు స్థిరపడుతుంటారు. సంజూ కూడా మళయాళీనే కావడంతో అక్కడి కేరళీయులు అతడికి మద్దతు తెలుపుతున్నారు. అంతేగాక ఫిఫా చూడటానికి వెళ్లిన పలువురు కేరళ ఫ్యాన్స్ కూడా  బ్యానర్లతో స్టేడియాలకు  హాజరవుతూ  అతడిపై ప్రేమను చాటుకుంటున్నారు.

''నిన్ను టీమిండియా  ఆడించినా ఆడించకపోయినా మేం నీతోనే ఉంటాం. నువ్వు ఏ జట్టు తరఫునా ఆడినా మంచిదే. మా మద్దతు ఎప్పుడూ నీకు ఉంటుంది.'' అని ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు.  సంజూ శాంసన్ ఫ్యాన్ పేజీ ఈ ఫోటోలను ట్విటర్ లో పోస్ట్ చేయగా  రాజస్తాన్ రాయల్స్ జట్టు  దానికి ..''అతడి మీద మీకున్న ప్రేమకు సలామ్..'' అని కామెంట్స్  చేయడం విశేషం. 

చదవండి: FIFA WC: 'సిగ్గుండాలి.. ఓపక్క ఏడుస్తుంటే సెల్ఫీ ఏంది?'

Cristiano Ronaldo: 'ఇదంతా తొండి.. ఆ గోల్‌ నాది'

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top