ఆ మూడు ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ చూస్తుంటా | Sachin Tendulkar Picks Three Best Innings From His Career | Sakshi
Sakshi News home page

ఆ మూడు ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ చూస్తుంటా

Dec 10 2020 3:38 PM | Updated on Dec 10 2020 5:33 PM

Sachin Tendulkar Picks Three Best Innings From His Career - Sakshi

ముంబై : అంతర్జాతీయ కెరీర్‌లో వంద సెంచరీలు.. అన్ని ఫార్మాట్లు కలిపి 34వేలకు పైగా  పరుగులు.. బ్యాటింగ్‌ విభాగంలో లెక్కలేనన్ని రికార్డులు.. ఈ దశాబ్దంలో అతను సాధించిన మైలురాళ్లను చేరుకోవడం ఇప్పటితరం ఆటగాళ్లకు కష్టమే.. ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి.. ఆ వ్యక్తి మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అని. ఒ‍కే ఆటగాడు లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించి వాటిలో మూడు బెస్ట్‌ ఇన్నిం‍గ్స్‌లను ఎంపిక చేసుకోవాలంటే కొంచెం కష్టమే. కానీ సచిన్‌ మాత్రం​ ఏ మాత్రం  సంకోచం లేకుండా తన మూడు బెస్ట్‌ ఇన్నింగ్స్‌లను ఎప్పటికి మరిచిపోనని.. వాటి హైలెట్స్‌ను  ఇప్పుడు కూడా వీక్షిస్తానని తెలిపాడు. యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సచిన్‌ ఈ విషయాలను పంచుకున్నాడు.(చదవండి : డ్రింక్స్‌ తాగడానికే ఐపీఎల్‌కు వచ్చేవాడు : సెహ్వాగ్‌)

'జీవితంలో లెక్కలేనన్ని రికార్డులు ఎన్నో సాధించా.. నేను ఆడిన ఇన్నింగ్స్‌ల్లో  ఒకదానిని మించి మరొకటి ది బెస్ట్‌ అనిపిస్తుంది. అందులోనూ ది బెస్ట్‌ ఏంచుకోమంటే మాత్రం ఆ మూడు ఇన్నింగ్స్‌ల గురించి ప్రస్తావిస్తా. మొదటి రెండు ఒకే సిరీస్‌లో వచ్చినవి. 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు. సెమీ ఫైనల్లో సెంచరీతో మెరిసి జట్టును ఫైనల్‌ చేర్చాను. అదే ఊపుతో ఫైనల్లో మరో సెంచరీ బాదేసి కోకకోలా కప్‌ను టీమిండియాకు అందించడం మరుపురాని జ్ఞాపకం.

ఆ తర్వాత మరో ఇన్నింగ్స్‌ గురించి చెప్పాలంటే 2003 ప్రపంచకప్‌. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగులు ఇన్నింగ్స్‌ను ఎప్పటికి మరిచిపోను. చిరకాల ప్రత్యర్థిపై శివరాత్రి రోజున ఆడిన ఆ ఇన్నింగ్స్‌ ఇప్పటికి నా కళ్ల ముందు కనిపిస్తుంది. అందుకే ఎప్పుడు వీలున్నా.. ఈ మూడు ఇన్నింగ్స్‌లకు సంబంధించిన వీడియోలు పెట్టుకొని ఎంజాయ్‌ చేస్తుంటా.' అని చెప్పుకొచ్చాడు.(చదవండి : 'శాస్త్రి ఆ విషయం నాకు ముందే చెప్పాడు')

ఇవేగాక మాస్టర్‌ కెరీర్‌లో మరిన్ని కలికితురాయిలు ఉన్నాయి.  1992లో క్రికెట్‌లో కొత్తగా అడుగుపెట్టిన రోజుల్లో ఆసీస్‌పై పెర్త్‌ వేదికగా 114 పరుగులు చేయడం హైలెట్‌గా చెప్పవచ్చు. అప్పటివరకు సాధారణ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న సచిన్‌కు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడే ధైర్యం కలిగించింది. అలాగే 2008లో ముంబై ఉగ్రదాడుల తర్వాత ఇంగ్లండ్‌పై చేసిన 108 పరుగుల ఇన్నింగ్స్‌ను ఎవరు మరిచిపోరు. ఉగ్రదాడి తర్వాత దేశకోసం కసిగా ఆడిన ఇన్నింగ్స్‌ అది.. అందుకే దీనికి ప్రత్యేక స్థానం ఉంటుందని సచిన్‌ చాలా సార్లు చెప్పుకొచ్చాడు. 1999 ప్రపంచకప్‌.. కెన్యాపై 140 పరుగులు సుడిగాలి ఇన్నింగ్స్‌ తర్వాత సచిన్‌ జీవితంలో పెను విషాదం చోటుచేసుకుంది. తండ్రి మరణవార్తను తెలుసుకున్న సచిన్‌ ఆ బాధను దిగమింగుకొని పాకిస్తాన్‌పై చేసిన 136 పరుగల ఇన్నింగ్స్‌ను క్రికెట్‌ అభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement