breaking news
best innigs
-
యువీ కెరీర్‌ను మలుపు తిప్పిన ఐదు బెస్ట్ ఇన్నింగ్స్‌లు
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్(డిసెంబర్ 12న) 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. యువీ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు(2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై). పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న యువరాజ్ దాదాపు రెండు దశాబ్దాల పాటు టీమిండియా క్రికెట్లో కీలకపాత్ర పోషించాడు. ఈ రెండు దశాబ్దాల్లో ఐసీసీ మేజర్ టోర్నీలైన 2007 టి20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్‌లు అతని ఖాతాలో ఉన్నాయి. డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన యువీలో మంచి బౌలర్ కూడా ఉన్నాడు. 2000 అక్టోబర్ నెలలో కెన్యాతో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు సాధించాడు. అయితే ఎన్నో ఘనతలు, రికార్డులు అందుకున్నప్పటికి ఇప్పుడు చెప్పుకోబోయే ఐదు ఇన్నింగ్స్‌లు మాత్రం అతని కెరీర్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. 69 పరుగులు వర్సెస్ ఇంగ్లండ్(నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్) నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ అతని కెరీర్లో నెంబర్‌వన్ స్థానంలో ఉంటుంది. యువరాజ్ కెరీర్‌నే కాదు టీమిండియా గతినే మార్చేసింది.. ఈ మ్యాచ్. 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు గంగూలీ(60), సెహ్వాగ్(45) తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించి పటిష్టమైన స్థితిలో నిలిపారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ కావడం.. ఆ తర్వాత 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చాడు యువరాజ్ సింగ్. మరో ఎండ్‌లో మహ్మద్ కైఫ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇద్దరు మంచి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను ముంఉదకు తీసుకెళ్లారు. ఆరో వికెట్‌కు ఇద్దరు కలిసి 221 పరుగులు రికార్డు భాగస్వామ్యంతో టీమిండియాను గెలుపు దిశగా నడిపించారు. అయితే విజయాన్ని 59 పరుగులు అవసరమైన దశలో యువీ ఔటైనప్పటికి.. అతని ఇన్నింగ్స్‌కు ముచ్చటపడిన కైఫ్ ఆ బాధ్యతలను తాను తీసుకున్నాడు. చివరి వరకు క్రీజులో నిలబడి టీమిండియాకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీ నుంచి కెప్టెన్ గంగూలీ తన షర్ట్‌ను విప్పి సెలబ్రేట్ చేయడం అప్పట్లో బాగా వైరల్ అయింది. యువీ కెరీర్లో మొదటి టర్నింగ్ పాయింట్ ఇదే. 139 వర్సెస్ ఆస్ట్రేలియా, 2004 2004లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. సిడ్నీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న యువరాజ్ సెంచరీ సాధించాడు. 122 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో 139 పరుగులు చేసిన యువీ కెరీర్లో ఇది రెండో బెస్ట్ అని చెప్పొచ్చు. అతని ధాటికి టీమిండియా 50 ఓవర్లలో 296 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది. 58 వర్సెస్ ఇంగ్లండ్, 2007 టి20 ప్రపంచకప్ యువీ కెరీర్లో మూడో టర్నింగ్ పాయింట్.. 2007 టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌తో మ్యాచ్. ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో గొడవ యువరాజ్‌లోని విధ్వంసాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది అతనికి నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. అంతేకాదు 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న యువరాజ్ టి20 క్రికెట్లో అత్యంత వేగంగా అర్థసెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటికి ఆ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. యువీ జోరుతో టీమిండియా తొలిసారి టోర్నీలో 200 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. 57 వర్సెస్ ఆస్ట్రేలియా(2011 వన్డే వరల్డ్‌కప్) 2011 వన్డే వరల్డ్‌కప్‌లో యువరాజ్ ఆల్‌రౌండర్‌గా కీలకపాత్ర పోషించాడు. జట్టులో ఒక ఆల్‌రౌండర్ ఉంటే ఎంత బలమో యువీ చేసి చూపించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 143 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి కష్టపడుతోంది. పిచ్ బౌలర్లకు సహకరిస్తుండడంతో క్రీజులోకి వచ్చిన యువీ తనలోని క్లాస్ ఆటను చూపించాడు. సురేశ్ రైనా సహకారంతో ఓపికగా ఆడని యువీ టీమిండియాకు 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. మ్యాచ్‌లో 67 బంతుల్లో 57 పరుగులతో యువరాజ్ నాటౌట్‌గా నిలిచాడు. 150 వర్సెస్ ఇంగ్లండ్, 2017 కెరీర్ చివరి దశలో యువరాజ్ ఆడిన ఆఖరి బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో యువరాజ్.. ఎంఎస్ ధోనితో కలిసి మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో కదం తొక్కిన యువరాజ్ 127 బంతుల్లో 150 పరుగులు చేశాడు. యువీ తన వన్డే కెరీర్లో అత్యధిక స్కోరును అందుకున్నాడు. యువీతో పాటు ధోని కూడా సెంచరీతో రాణించడంతో టీమిండియా 381 పరుగులు భారీ స్కోరు చేసింది. 15 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పరాజయం చెందింది. యువీ కెరీర్లో ఇదే ఆఖరి బెస్ట్ ఇన్నింగ్స్. ఆ తర్వాత క్రమంగా ఫామ్ కోల్పోయిన యువరాజ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. To celebrate Yuvraj Singh's birthday, tell us your favourite memory of his ✨ pic.twitter.com/bCcSuqQbHq — ICC (@ICC) December 12, 2020 చదవండి: 'ఆ ఎక్స్ప్రెషన్ ఏంటయ్యా.. పిల్లలు జడుసుకుంటారు' Harry Kane: హీరో అనుకుంటే జీరో అయ్యాడు -
ఆ మూడు ఇన్నింగ్స్‌లు ఇప్పటికీ చూస్తుంటా
ముంబై : అంతర్జాతీయ కెరీర్లో వంద సెంచరీలు.. అన్ని ఫార్మాట్లు కలిపి 34వేలకు పైగా పరుగులు.. బ్యాటింగ్ విభాగంలో లెక్కలేనన్ని రికార్డులు.. ఈ దశాబ్దంలో అతను సాధించిన మైలురాళ్లను చేరుకోవడం ఇప్పటితరం ఆటగాళ్లకు కష్టమే.. ఈ పాటికే మీకు అర్థమయి ఉండాలి.. ఆ వ్యక్తి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అని. ఒకే ఆటగాడు లెక్కకు మిక్కిలి రికార్డులు సాధించి వాటిలో మూడు బెస్ట్ ఇన్నింగ్స్‌లను ఎంపిక చేసుకోవాలంటే కొంచెం కష్టమే. కానీ సచిన్ మాత్రం ఏ మాత్రం సంకోచం లేకుండా తన మూడు బెస్ట్ ఇన్నింగ్స్‌లను ఎప్పటికి మరిచిపోనని.. వాటి హైలెట్స్‌ను ఇప్పుడు కూడా వీక్షిస్తానని తెలిపాడు. యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సచిన్ ఈ విషయాలను పంచుకున్నాడు.(చదవండి : డ్రింక్స్ తాగడానికే ఐపీఎల్‌కు వచ్చేవాడు : సెహ్వాగ్) 'జీవితంలో లెక్కలేనన్ని రికార్డులు ఎన్నో సాధించా.. నేను ఆడిన ఇన్నింగ్స్‌ల్లో ఒకదానిని మించి మరొకటి ది బెస్ట్ అనిపిస్తుంది. అందులోనూ ది బెస్ట్ ఏంచుకోమంటే మాత్రం ఆ మూడు ఇన్నింగ్స్‌ల గురించి ప్రస్తావిస్తా. మొదటి రెండు ఒకే సిరీస్‌లో వచ్చినవి. 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు. సెమీ ఫైనల్లో సెంచరీతో మెరిసి జట్టును ఫైనల్ చేర్చాను. అదే ఊపుతో ఫైనల్లో మరో సెంచరీ బాదేసి కోకకోలా కప్‌ను టీమిండియాకు అందించడం మరుపురాని జ్ఞాపకం. ఆ తర్వాత మరో ఇన్నింగ్స్ గురించి చెప్పాలంటే 2003 ప్రపంచకప్. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగులు ఇన్నింగ్స్‌ను ఎప్పటికి మరిచిపోను. చిరకాల ప్రత్యర్థిపై శివరాత్రి రోజున ఆడిన ఆ ఇన్నింగ్స్ ఇప్పటికి నా కళ్ల ముందు కనిపిస్తుంది. అందుకే ఎప్పుడు వీలున్నా.. ఈ మూడు ఇన్నింగ్స్‌లకు సంబంధించిన వీడియోలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటా.' అని చెప్పుకొచ్చాడు.(చదవండి : 'శాస్త్రి ఆ విషయం నాకు ముందే చెప్పాడు') ఇవేగాక మాస్టర్ కెరీర్లో మరిన్ని కలికితురాయిలు ఉన్నాయి. 1992లో క్రికెట్లో కొత్తగా అడుగుపెట్టిన రోజుల్లో ఆసీస్‌పై పెర్త్ వేదికగా 114 పరుగులు చేయడం హైలెట్‌గా చెప్పవచ్చు. అప్పటివరకు సాధారణ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న సచిన్‌కు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడే ధైర్యం కలిగించింది. అలాగే 2008లో ముంబై ఉగ్రదాడుల తర్వాత ఇంగ్లండ్‌పై చేసిన 108 పరుగుల ఇన్నింగ్స్‌ను ఎవరు మరిచిపోరు. ఉగ్రదాడి తర్వాత దేశకోసం కసిగా ఆడిన ఇన్నింగ్స్ అది.. అందుకే దీనికి ప్రత్యేక స్థానం ఉంటుందని సచిన్ చాలా సార్లు చెప్పుకొచ్చాడు. 1999 ప్రపంచకప్.. కెన్యాపై 140 పరుగులు సుడిగాలి ఇన్నింగ్స్ తర్వాత సచిన్ జీవితంలో పెను విషాదం చోటుచేసుకుంది. తండ్రి మరణవార్తను తెలుసుకున్న సచిన్ ఆ బాధను దిగమింగుకొని పాకిస్తాన్‌పై చేసిన 136 పరుగల ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు ఎప్పటికి మరిచిపోలేరు. -
ఇప్పటికీ అదే బెస్ట్ ఇన్నింగ్స్..
లండన్: భారత టెస్టు క్రికెట్ చరిత్రలో వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగుల ఇన్నింగ్స్కున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈడెన్ గార్డెన్స్ (2001)లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తను ఈ అత్యద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న తీరు ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేడు. ఈ ఇన్నింగ్స్ కు మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గత 16 ఏళ్లలో లక్ష్మణ్ ఆడిన ఈడెన్ ఇన్నింగ్స్‌కు అత్యుత్తమ గుర్తింపు దక్కడం విశేషం. లండన్ కు చెందిన 'ఆలౌట్ క్రికెట్' మ్యాగజైన్ నిర్వహించిన తాజా ఓటింగ్‌లో లక్ష్మణ్ ఇన్నింగ్స్ కు ప్రథమ స్థానం కట్టబెట్టారు. పలువురు మాజీ క్రికెటర్లు, కామెంటేటర్స్‌తో సహా 37 మంది కూడిన ప్యానెల్లో లక్ష్మణ్ ఇన్నింగ్స్ కు అగ్రస్థానం దక్కింది. మరోవైపు 2004లో పాకిస్తాన్‌పై వీరేంద్ర సెహ్వాగ్ నమోదు చేసిన ట్రిపుట్ సెంచరీకి తొమ్మిది స్థానం దక్కగా, 2003లో ఆస్ట్రేలియాపై రాహుల్ ద్రవిడ్ నమోదు చేసిన 233 పరుగులకు నాల్గో స్థానం లభించింది. జనవరి 1, 2000 సంవత్సరం నుంచి ఆటగాళ్ల టాప్-20 టెస్టు ఇన్నింగ్స్ లకు ఓటింగ్ నిర్వహించారు. ఇందులో 2001లో లక్ష్మణ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 371 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసే క్రమంలో ద్రవిడ్(180) పరుగులకు 14వ స్థానం దక్కింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 59 పరుగులు చేసిన లక్ష్మణ్.. రెండో ఇన్నింగ్స్‌లో 281 పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా చుక్కలు చూపించిన లక్ష్మణ్ ఆనాటి భారత్ గెలుపులో కీలక పాత్ర వహించాడు. లక్ష్మణ్-ద్రవిడ్‌ల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ 171 పరుగులతో విజయం సాధించింది. ఈ ఏడాది జనవరిలో ఈఎస్పీఎన్ డిజిటల్ క్రికెట్ మ్యాగజైన్ నిర్వహించిన ఓటింగ్‌లో ఈ ఇన్నింగ్స్‌కే తొలిస్థానం దక్కింది. గత ఐదు దశాబ్దాలలో 50 అత్యుత్తమ ప్రదర్శనలకు ఈ ఓటింగ్ నిర్వహించారు.