సౌతాఫ్రికా టీ20 లీగ్‌.. తొలి మ్యాచ్‌ వర్షార్పణం

SA20 2024: Sunrisers Eastern Cape Vs Joburg Super Kings Match Abandoned Due To Rain - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌ 2024 ఎడిషన్‌కు వరుణుడు ఘన స్వాగతం పలికాడు. సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌, జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ మధ్య నిన్న (జనవరి 10) జరగాల్సిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. గతేడాది ఛాంపియన్‌ అయిన సన్‌రైజర్స్‌ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా ఉండింది. సన్‌రైజర్స్‌కు ఎయిడెన్‌ మార్క్రమ్‌ నాయకత్వం వహిస్తుండగా..  జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ డుప్లెసిస్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. సూపర్‌ కింగ్స్‌ గతేడాది సెమీఫైనల్‌ వరకు చేరింది. 

ఇదిలా ఉంటే, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ గత ఎడిషన్‌లోనే పురుడు పోసుకుంది. తొలి ఎడిషన్‌ ఫైనల్లో సన్‌రైజర్స్‌.. ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ప్రిటోరియా 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌట్‌ కాగా.. సన్‌రైజర్స్‌ 16.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.  

సన్‌రైజర్స్‌ ఈస్ట్రన్‌ కేప్‌ స్క్వాడ్: ఆడమ్ రోసింగ్టన్ (వికెట్‌కీపర్‌), ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), టెంబా బవుమా, డేవిడ్ మలాన్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జన్సెన్, సైమన్ హార్మర్, టామ్‌ ఎబెల్, ఒట్నీల్ బార్ట్‌మన్, లియామ్ డాసన్, అయాబులెలా గ్కమనే, సరెల్ ఎర్వీ, ప్యాట్రిక్‌ క్రూగర్స్, బెయర్స్‌ స్వానోపోల్‌, ఆండీల్‌ సైమ్‌లేన్‌, కాలెబ్‌ సలేకా, జోర్డన్ హెర్మన్

జోబర్గ్ సూపర్ కింగ్స్ స్క్వాడ్‌: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), డోనోవన్ ఫెరీరా (వికెట్‌కీపర్‌), రీజా హెండ్రిక్స్, లీస్‌ డు ప్లూయ్, మొయిన్ అలీ, రొమారియో షెపర్డ్, కైల్ సిమండ్స్, గెరాల్డ్ కొయెట్జీ, లిజాడ్‌ విలియమ్స్, నండ్రే బర్గర్‌, ఇమ్రాన్‌ తాహిర్, వేన్ మాడ్‌సెన్, ఆరోన్ ఫంగిసో, డేవిడ్ వీస్, డయ్యన్ గేలియం, సిబోనెలో మఖాన్యా, జహీర్ ఖాన్, సామ్ కుక్, రోనన్ హెర్మాన్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top