నిరాశ‌ప‌రిచిన బోప‌న్న‌-బాలాజీ జోడీ.. తొలి రౌండ్‌లోనే ఔట్‌ | Rohan Boppana And Sriram balaji Pair early exit from Paris Olympics | Sakshi
Sakshi News home page

Paris Olympics: నిరాశ‌ప‌రిచిన బోప‌న్న‌-బాలాజీ జోడీ.. తొలి రౌండ్‌లోనే ఔట్‌

Jul 29 2024 2:58 PM | Updated on Jul 29 2024 3:34 PM

Rohan Boppana And Sriram balaji Pair early exit from Paris Olympics

ప్యారిస్ ఒలింపిక్స్‌-2024 టెన్నిస్‌లో భార‌త్‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ జోడీ మొదటి రౌండ్‌లోనే ఇంటిముఖం ప‌ట్టింది. సోమ‌వారం జ‌రిగిన తొలి రౌండ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన‌ గేల్‌ మోన్‌ఫిల్స్‌, ఎడ్వర్డ్‌ రోజర్‌-వాసెలిన్‌ జోడీ చేతిలో 7-5, 6-2 తేడాతో బోపన్న-శ్రీరామ్ జంట ఓట‌మి పాలైంది.

టెన్నిస్ మెన్స్‌ సింగిల్స్‌లో సుమిత్ నాగల్ తొలి రౌండ్‌లో నిష్క్ర‌మించ‌డంతో అంద‌రి ఆశ‌లు రోహన్ బోపన్న, శ్రీరామ్‌ల‌పై ఉండేవి. ఇప్పుడు వీరిద్ద‌రూ కూడా వ‌రుస సెట్ల‌లో ఓడిపోయి నిరాశ‌ప‌రిచారు. తొలి సెట్‌లో ఫ్రెంచ్ జోడీకి బోపన్న, బాలాజీ గట్టిపోటీని అందించగా.. రెండో సెట్‌ లో భారత జోడీ ఏమాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement