Ind Vs WI T20I Series: విండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌!

Ravindra Jadeja Doubtful for T20 Series, says Reports - Sakshi

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. భారత్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా టీ20 సిరీస్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. విండీస్‌తో తొలి వన్డేకు ముందు నెట్స్‌లో జడేజా గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో అతడు విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. అయితే జడ్డూ ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేనట్లు తెలుస్తోంది. జడేజా ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షిణలో ఉన్నాడని, అతడు ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో అతడు శుక్రవారం నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు అందుబాటుపై సందేహం నెలకొంది. ఇక వన్డే సిరీస్‌కు దూరమైన జడేజా స్థానంలో చోటు దక్కించుకున్న అక్షర్‌ పటేల్‌ అదరగొట్టాడు. ఒక వేళ జడేజా టీ20 సిరీస్‌కు దూరమైతే అతడి స్థానంలో అక్షర్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయం. మరోవైపు కరోనా బారిన పడిన టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అందుబాటుపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఇక విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ తలపడనుంది. సెయింట్ కిట్స్ వేదికగా శుక్రవారం(జూలై 29) జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు:
రోహిత్ శర్మ (సి), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, రిషబ్ పంత్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌ అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌ సింగ్‌
చదవండి: Ind Vs WI T20I Series: విండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాకు భారీ షాక్‌! సిరీస్‌ మొత్తానికి అతడు దూరం?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top