ఆర్సీబీ ఓపెనర్‌ చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే | Phil Salt Becomes First Batter To Be Dismissed 3 Times On First Ball Of IPL Match | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆర్సీబీ ఓపెనర్‌ చెత్త రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే

Apr 10 2026 9:25 PM | Updated on Apr 10 2026 9:25 PM

Phil Salt Becomes First Batter To Be Dismissed 3 Times On First Ball Of IPL Match

PC: BCCI/IPL

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్‌ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఓ అవాంఛిత రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్‌లోని మొదటి బంతికే మూడుసార్లు అవుట్ తొలి ప్లేయర్‌గా సాల్ట్ నిలిచాడు. ఐపీఎల్‌-2026లో గౌహతి వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదటి బంతికే సాల్ట్ ఔటయ్యాడు. రాజస్తాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మొదటి బంతికే అద్భుతమైన బౌన్సర్‌తో సాల్ట్‌ను బోల్తా కొట్టించాడు. 

దీంతో తొలి బంతికే అత్యధిక సార్లు ఔటైన బ్యాటర్‌గా పార్ధివ్ పటేల్‌, పృథ్వీషాను సాల్ట్ అధిగమించాడు. వీరిద్దరూ గతంలో రెండు సార్లు మ్యాచ్ తొలి బంతికే ఔటయ్యారు. ఓవరాల్‌గా ఐపీఎల్ ఇన్నింగ్స్ పరంగా అయితే ఈ చెత్త రికార్డు సాధించిన జాబితాలో పార్థివ్ పటేల్‌(4 సార్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానంలో డ్వేన్ స్మిత్, పృథ్వీ షా, కెఎల్ రాహుల్, సాల్ట్ ఉన్నారు.

ఇన్నింగ్స్ మొదటి బంతికే అత్యధిక సార్లు అవుటైన ప్లేయర్లు
4 - పార్థివ్ పటేల్
3 - డ్వేన్ స్మిత్
3 - పృథ్వీ షా
3 - కేఎల్‌ రాహుల్
3 - ఫిల్ సాల్ట్*
చదవండి: IPL 2026: 'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్‌'

Advertisement
 
Advertisement
Advertisement