'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్‌' | MS Dhoni-Inspired Mukul Choudhary Reveals His Practice Regime | Sakshi
Sakshi News home page

IPL 2026: 'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్‌'

Apr 10 2026 7:36 PM | Updated on Apr 10 2026 7:48 PM

MS Dhoni-Inspired Mukul Choudhary Reveals His Practice Regime

PC: BCCI/IPL

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ యువ సంచ‌ల‌నం ముకుల్ చౌద‌రి ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవ‌ర్ నైట్‌స్టార్‌గా మారిపోయాడు. ప్ర‌స్తుతం క్రికెట్ ప్ర‌పంచం మొత్తం అత‌డి గురించే మాట్లాడుకుంటోంది. 21 ఏళ్ల ముకుల్ చారిత్ర‌త్మ‌క ఈడెన్‌గార్డెన్స్‌లో అద్భుతం చేశాడు.

త‌న విరోచిత బ్యాటింగ్‌తో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఓట‌మి త‌ప్ప‌ద‌కున్న చోట‌ చివ‌రి బంతికి ల‌క్నో గెలిపించి రియల్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ముకుల్‌ కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో 2 ఫోర్లతో పాటు 7 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. 

అంటే అత‌డి సాధించిన ప‌రుగుల‌లో మెజారిటీ భాగం సిక్సర్ల ద్వారానే వచ్చాయి. కాగా మ్యాచ్ అనంత‌రం త‌న ఇన్నింగ్స్ గురుంచి మాట్లాడిన ముకుల్ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ సంద‌ర్భంగా భార‌త క్రికెట్ దిగ్గ‌జం ఎంఎస్ ధోని త‌న‌ రోల్‌మోడ‌ల్ ముకుల్ చెప్పుకొచ్చాడు.

"మా నాన్న‌కు పెళ్లి కాక‌ముందే త‌న‌కు కొడుకు పుడితే క్రికెట‌ర్‌ను చేయాల‌ని క‌ల‌లు క‌నేవారు. ఈ విజయాన్ని మా నాన్నకు అంకితమిస్తున్నాను. అలాగే ధోనీ స‌ర్ మ్యాచ్‌ను ఫినిష్ చేసే తీరును చూస్తూ నేను పెరిగాను. ఆయ‌న నాకు రోల్‌మోడ‌ల్. ఇప్పుడు నేను కూడా లోయార్డర్‌లోనే బ్యాటింగ్‌కు వస్తున్నాను. 

కాబట్టి ఈ ఇన్నింగ్స్‌ను ఆయనకు కూడా చేస్తున్నాను. శరీర త‌త్వంగా కార‌ణంగానే నేను ఆడే షాట్ల‌లో అంత ప‌వ‌ర్ ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి షాట్లు ఆడేందుకు నేను చాలా ఎక్కువ‌గా సాధ‌న కూడా చేశాను. ప్రతిరోజూ నెట్స్‌లో సుమారు 100 నుండి 150 సిక్సర్లు కొడుతూ ప్రాక్టీస్ చేస్తున్నాను. గత ఐదు, ఆరు నెలలుగా మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌మిస్తున్నాను.

ఆ ఫ‌లిత‌మే ఇప్పుడు నా ఆట‌లో  కనిపిస్తోంది. హెలీకాప్ట‌ర్‌ షాట్ అంటే నాకెంతో ఇష్టం. చిన్నప్పటి నుంచే ఆ షాట్‌ను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. ధోని ఫినిషింగ్ స్టైల్ కూడా నాకెంతో ఇష్టం. అతను యార్కర్ బంతిని కూడా సిక్సర్‌గా మలిచేవాడు. అలాంటి బంతిని కూడా సిక్స్ కొడితే, బౌలర్ కచ్చితంగా ఒత్తిడితోకి వెళ్తాడు" అని ముకుల్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: ఎస్ఆర్‌హెచ్ కీల‌క నిర్ణ‌యం! రూ.13 కోట్ల ఆట‌గాడిపై వేటు?



 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement